Smriti Irani's Instagram has a quirky response కేంద్రమంత్రి చమత్కారానికి నెట్ జనులు ఫిదా..

Smriti irani takes to instagram to clap back on trolling over

Union minister, Instagram, Sabarimala, sabarimala protesters, women devotees, Kyunki... Saas Bhi Kabhi Bahu Thi still, Smriti Irani, Critics, sanitary pad, troll, viral post, social media

Union minister Smriti Irani, whose comments on Sabarimala protests drew a lot of flak, posted a dramatic photo on Instagram to imply that her critics were not allowing her to speak.

కేంద్రమంత్రి చమత్కారానికి నెట్ జనులు ఫిదా..

Posted: 10/26/2018 01:28 PM IST
Smriti irani takes to instagram to clap back on trolling over

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుండే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తాజాగా చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. అమెకు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇది కేంద్రమంత్రి తనలోని చమత్కారాన్ని కూడా వ్యక్తీకరించడంతో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ ఫొటోకు వేల లైకులు వచ్చాయి. ఇంతకీ అమె చేసిన పోస్టు ఏంటీ.. దానిని నెట్ జనుల నుంచి స్పందనేంటీ అన్న వివరాలు ఏంటంటే.

శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇటీవల మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడడం సరికాదని, తాను ఓ మంత్రినని, కానీ తన అభిప్రాయం ప్రకారం తనకు పూజించే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే, అలాంటి ప్రదేశాన్ని అపవిత్రం చేసే హక్కు మాత్రం ఉండదని, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను గుర్తించి గౌరవించాల్సిందేనని అన్నారు. అది మన విజ్ఞతకు సంబంధించిన విషయమని అమె నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అమె చెప్పిన మాట్లలో మాత్రం శబరిమలకు వెళ్లకూడదన్న విషయం స్పష్టం అవుతున్నా.. విమర్శలు మాత్రం ఆగలేదు.

మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన స్మృతి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేశారు. కుర్చీలో కూర్చున్న ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోరు కూడా మూసేశారు. గతంలో ఆమె నటించిన ‘క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ’ అనే సీరియల్‌లోనిది ఈ ఫొటో. దీనికింద ఆమె తానేదైనా మాట్లాడితే ఎప్పుడూ వాగుతూనే ఉంటానని అంటారని క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అవుతున్నారు. ఒక్క ఫొటోతో తానేం చెప్పాలనుకున్నారో దానిని స్పష్టంగా చెప్పారని ప్రశంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union minister  Instagram  Sabarimala  Smriti Irani  Critics  sanitary pad  troll  viral post  social media  

Other Articles