Police fined cyclist for riding without a helmet సైకిలిస్టుకు హెల్మెట్ లేదని జరిమానా

Police fined cyclist for riding without a helmet

Kerala Police, Kerala Traffic Police, Overspeeding, Traffic Violation, bicycle overspeeding, bicycle helmet, Kasim, uttar pradesh, kerala daily waged labour, crime

Kerala Police fined a man riding his bicycle in Kumbala Kerala without helmet and overspeeding. Kasim a resident of UP and is a daily wage worker in Kerala was riding to work on a highway. The cops present on the duty fined him Rs. 2,000.

ITEMVIDEOS: భళా పోలీసు.. సైకిలిస్టుకు హెల్మెట్ లేదని జరిమానా

Posted: 10/08/2018 02:57 PM IST
Police fined cyclist for riding without a helmet

ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులపై అటు సినిమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ పలు విమర్శలు, జోకులు పేలుతున్నా.. వారు అప్రమత్తం కావాల్సింది పోయి.. విమర్శకులకు మరింత అవకాశాన్ని కల్పిస్తు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కారులో వెళ్తున్న వ్యక్తికి అపి హెల్మెట్ ఏదని నిలదీసి ఫైస్ రాసిన పోలీసులు.. మరో బైక్ రైడర్ ను పట్టుకుని సీటు బెల్టు పెట్టుకోలేదని జరిమానా విధించిన పలు సందర్భాలలో పోలీసులపై విమర్శలు వెల్లివిరుస్తూనే వున్నాయి.

తాజాగా మరోమారు ట్రాఫిక్ పోలీసులు వార్తల్లో నిలిచి విమర్శల పాలయ్యారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలుసు.. అది లేకుండా వాహనాన్ని నడిపితే జరిమానా తప్పదని కూడా తెలుసు. అయితే, ఈ నిబంధన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంది. ఏంటీ అంటూ విస్తుపోతున్నారా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇదే నెపాన్ని చూపి ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు.

నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది నిజం. పోలీసులు విధించిన జరిమానాతో బిత్తరపోయిన సైకిలిస్టు.. వారితో వాగ్వాదానికి దిగినా.. వారు జరిమానాను తగ్గించారే తప్ప.. ముక్కుపిండి వసూలు చేయాల్సిన మొత్తాన్ని మాత్రం మానుకోలేదు. అదీ ఎందుకంటే.. తన వద్ద అంత మొత్తం లేదని ఆ అభాగ్య వ్యక్తి మొర పెట్టుకుంటూ చివరాఖరు కనికరించిన పోలీసులు అతనికి రూ. 2000 లకు బదులుగా రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్ గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. అక్కడితో ఆగక సైకిలు టైర్లలోని గాలిని తొలగించారు. ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అది కాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic Police  Overspeeding  Traffic Violation  bicycle  helmet  Kerala  crime  

Other Articles