Have no plans of killing PM Modi ఆ లేఖలు మావి కాదు: మావో అభయ్

Have no plans of killing pm modi maoist abhay

Prime Minister Narendra Modi, maoists, central committee member, abhay, varavara rao, sudha baradwaj, Arun ferira, goutham, vernam, human rights activists, crime

The Maoists central committee member abhay has clarified that they have never planned and sketched a conspiracy to kill PM Narendra Modi.

ప్రధానిని చంపాల్సిన అవసరం మాకు లేదు: మావోలు

Posted: 10/01/2018 06:57 PM IST
Have no plans of killing pm modi maoist abhay

ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రలో ప్రమేయం ఉందన్న అభియోగాలపై మానవ హక్కుల నేతలు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టిన క్రమంలో ఈ కేసు ప్రస్తుతం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సాగుతుంది. ఈ కేసుతో తాము అరెస్టు చేసిన మానవతా వాదులకు పరోక్షంగా సంబంధాలు వున్నాయని అందుకు సంబంధించిన లేఖలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు అరోపించారు.

అలాగే గతేడాది డిసెంబర్ లో మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం వీరే హింసను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విరసం సభ్యుడు వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 28న అరెస్ట్ చేయగా, వారందరికీ తాజాగా మరో నాలుగు వారాల పాటు గృహనిర్భంధాన్ని సర్వోన్నత న్యాయస్థానం పోడిగించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీరి అరెస్టులపై స్పందించారు.

ప్రధాని మోదీ హత్యకు తాము పౌర హక్కుల నేతలతో కలసి కుట్ర పన్నలేదని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కి చెందిన అభయ్ లేఖ విడుదల చేశారు. హక్కుల నేత రోనా విల్సన్ దగ్గర దొరికినట్లు పోలీసులు చెబుతున్న లేఖలు బూటకమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పౌర హక్కుల నేతలపై జరుగుతున్న అణచివేతలపై ప్రజాస్వామ్య వాదులు స్పందించాలని కోరారు.

ప్రధానిని హత్య చేయాలని తాము ఎవరికీ లేఖ రాయలేదనీ, అలాంటి అవసరం తమకు లేదని అభయ్ స్పష్టం చేశారు. పుణెలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం దళితులకు-అగ్రవర్ణాలకు మధ్య భీమా-కోరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడుల్లో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు మావోలు రాసుకున్న లేఖలు తమకు దొరికాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ తరహాలో మోదీని మట్టుబెట్టేందుకు మావోలు ప్లాన్ వేశారనీ, ఇందుకోసం ఆయుధాల కొనుగోలుకు వరవరరావు సాయం చేస్తాడని లేఖలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  maoists  central committee member  abhay  varavara rao  human rights activists  crime  

Other Articles