PM surveys floods, Grants Rs.500-Cr Aid కేరళకు రూ.500 కోట్ల తక్షణ సాయం: ప్రధాని

Pm surveys kerala floods grants rs 500 crore emergency aid

Kerala Floods, Kerala Rain, PM Narendra Modi, Modi aerial survey, Kerala landslides, Kerala floods 2018, Kerala flood, Kerala rains, Kerala rains, Kerala flood news, Floods in Kerala, Idukki dam, Kerala CM Pinarayi Vijayan, Governor P. Sathasivam, Union Tourism Minister KJ Alphons

PM Modi held a meeting with the Kerala CM Pinarayi Vijayan and announced an immediate flood relief of Rs. 500 crore for the state. After the Kerala government asked Rs 2000 cr aid as Kerala is facing its worst flood in 100 years.

ITEMVIDEOS: కేరళకు రూ.500 కోట్ల తక్షణ సాయం: ప్రధాని

Posted: 08/18/2018 01:17 PM IST
Pm surveys kerala floods grants rs 500 crore emergency aid

దేవుడి సోంత రాష్ట్రంపై పగబట్టిన వరుణుడు.. ఏకధాటిగా గత పది రోజులుగా తన ప్రతాపాన్ని చాటుతూ ప్రళయాన్ని చూపుతున్న క్రమంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో కాకవికళమైన కేరళలోని ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షన సహాయ నిధిని ప్రకటించారు. తక్షణ సాయం కింద రెండు వేల కోట్ల రూపాయలను అడిగిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వినతి మేరకు ప్రధాని ఎమర్జెన్సీ ఎయిడ్ కింద ఈ సహాయ నిధిని ప్రకటించారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం ప్రధాని మోడీ నిన్న సాయంత్రమే కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటనను వెల్లవరించారు. ప్రకటనకు ముందుగానే ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయాల్సివుంది. ఇందుకోసం ఆయన ఇవాళ ఉదయం కోచికి వెళ్లారు. వాస్తవానికి ఇవాళ ఉదయం కోచి నావెల్‌ బేస్‌ నుంచి బయల్దేరి ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే చేపట్టాల్సి ఉంది.

అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానం వెనక్కి వచ్చింది. న్నా వాతావరణం అనుకూలించక పోవడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో ఆయన తొలుత ఈ మేరకు సహాయ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, గవర్నర్ సి సదాశివమ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే అల్ఫోన్స్ తో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్‌ సర్వే చేపట్టారు. అయితే పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా తమకు రూ. 2000కోట్లు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌ చేసినప్పటికీ.. రూ. 500కోట్లే ఇస్తామని ప్రకటించారు. వరదల కారణంగా కేరళ ఇప్పటివరకు రూ.19వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.

అంతేగాక వరద బాధితులకు పీఎం జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం కూడా మోదీ ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వేను చేపట్టారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ జలదిగ్బంధంలో కూరుకుపోయింది. ఎటుచూసిన వరదనీరే కన్పిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వర్షాల సంబంధిత ఘటనల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. నేడు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Floods  PM Modi  Pinarayi Vijayan  Governor  Sathasivam  KJ Alphons  Aerial survey  

Other Articles