Fresh low to give more rains over Telugu states మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలు కలవరం..

Fresh low to give more rains over odisha telugu states

Indian Meteorological Department (IMD), IMD, low depression, Bay of Bengal, Telangana, Andhra pradesh, Heavy rains, Telugu states, kerala floods, depression in bay of bengal, weather alert, thunderstorm rains, Odisha, chhattisgarh, vidharba, floods

According to the Indian Meteorological Department (IMD), the low depression, that has formed over the north Bay of Bengal, centered between chhattisgarh and vidharba, would be hitting the Telugu states along with odisha.

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలు కలవరం..

Posted: 08/18/2018 02:36 PM IST
Fresh low to give more rains over odisha telugu states

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో వరుణుడు ప్రళయకార రుద్రుడై ప్రకోపాన్ని చూపుతున్న క్రమంలో మరో అందోళనకర వార్తను వెలువరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు.

చత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతం అయిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే మత్య్సాకారులు వేటకు వెళ్లరాదని గతంలో ఇచ్చిన అదేశాలను మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా అంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతాల్లు ఇప్పటికే విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించిన విషయం తెలిసిందే.

ఇక దీనికి తోడు మరో హెచ్చరిక కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఒడిశా తీరప్రాంతవాసులను కలవరానికి గురిచేస్తుంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం ఉత్తర బంగాళఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే దీనికి వాతావరణం అనుకూలించి బలపడితే వాయుగుండంగా మారుతుందని.. అదే జరిగితే తెలుగు రాష్ట్రాలపై కూడా వరుణుడి ప్రతాపం అధికంగా వుండే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

శ్రీశైలం జలాశయానికి జలకళ..  

ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుని పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.7 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ఇవాళ ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ శ్రీశైలం జలాశయానికి చెందిన నాలుగు గేట్లు ఎత్తివేసి నీటినీ దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపుగా లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విడుదల చేయనున్నారు.

ఎగువనున్న జలాశయాలు జూరాల ప్రాజెక్టు నుంచి 1, 51,653 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి, 1,84,712 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. మొత్తం 3.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనివాకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 26వేల క్యూసెక్కలు నీరు విడుదలవవుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్ కు 74,767 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles