Pawan Kalyan gives befitting reply to YS Jagan జనం సోమ్ము స్వాహా చేసి.. నాపై విమర్శలా: పవన్ కల్యాణ్

Pawan kalyan gives befitting reply to ys jagan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, Jagan, YS Jagan, jagan comments, pawan kalyan critises jagan, west godavari, bhimavaram, leg injury, pawan kalyan porata yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gives befitting reply to YS Jagan, says a leader who is on bail from his disappropriate assets case critises a man who wants to bring transperancy change in government.

జగన్ కు జనసేనాని కౌంటర్: బెయిలుపై వచ్చి.. నాపై కామెంట్లా..

Posted: 07/25/2018 05:47 PM IST
Pawan kalyan gives befitting reply to ys jagan

రాజకీయాల్లో అధికారం, ధనం సంపాయించేందుకు తాను రాలేదని, ఇప్పటి వరకు వున్న రాజకీయాలకు పూర్తి భిన్నమైన మార్పును తీసుకువచ్చేందుకే తాను వచ్చానని ప్రజలు విశ్వసిస్తున్నారని.. ఈ క్రమంలో అవీనీతిపరులైన నేతలు తనపై బురదజల్లి.. ప్రజల దృష్టిని ఏమార్చడానికి విమర్శలు చేస్తున్నారని జనసేన అధినేత, పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేశారని అన్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతోనే జగన్, బీజేపీ నేతలు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుని అవినీతి కేసుల్లో 16 మాసాలు జైలులో వుండి.. బెయిలుపై వచ్చి రాజకీయాలు చేస్తున్న జగన్ కే అంతుంటే, నిజాయతీ పరుడినైన తనకు ఎంత ఉండాలని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. వైసీపీ అధినేత జగన్ విమర్శలపై స్పందిస్తూ భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో, జగనో కాదని చురక అంటించారు. జవాబుదారితనం, పారదర్శకత లోపించిన రాజకీయాలు చేసి ప్రజాధనాన్ని దోచుకుని దాచుకున్న వ్యక్తులు.. నిజాయితీ రాజకీయాల కోసం పాటు పడుతూ.. వస్తున్న డబ్బును వద్దనుకుని సేవ చేసేందుకు వచ్చిన తనను టార్గెట్ చేయడమేంటని విమర్శించారు.
 
సామాజికమార్పు తీసుకురావడం త‌న ఆశ‌య‌మ‌ని, దానికోసమే సినిమాల‌ను సాధ‌నంగా ఉప‌యోగించుకున్నాన‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు శ్ర‌మ‌, ఓపిక చాలా అవ‌స‌ర‌మ‌ని ఆయన తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ, స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కొంత‌మంది నాయ‌కులు జ‌నం మ‌ధ్య త‌గాదాలు పెట్టి విభ‌జించి పాలిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అటువంటి వారిని నిలువ‌రించి ధైర్యంగా ఎదుర్కోవ‌డానికే జ‌న‌సేన పార్టీని ప్రారంభించానని అన్నారు.  ‘జ‌న‌సేన’ మూడో ప్ర‌త్యామ్నాయంగా, మూడో ఆలోచ‌న విధానం రావ‌డం వ‌ల్లే ఉద్దానం, ఉండ‌వ‌ల్లి వంటి స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయని గుర్తు చేశారు.

భీమ‌వ‌రంలోని నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో జ‌న‌ సైనికుల‌తో స‌మావేశ‌మైన ఆయన.. వారు నవయుగ జనసేన పేరుతో చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఉద్దానం కిడ్నీ సమ‌స్య‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చింది జగన్, చంద్రబాబు లాంటి ఎవ‌రో పెద్ద రాజ‌కీయ‌ నాయ‌కుడు కాద‌ని, మీలాగే ఒక జ‌న‌ సైనికుడ‌ని అన్నారు. ప్ర‌తిమండ‌లానికి 15 నుంచి 20 మంది యువ‌త‌తో ఓ క‌మిటీ వేస్తామ‌ని, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి గ్రామ‌గ్రామానికి తిరిగి ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా తెలుసుకోవాల‌ని సూచించారు.

మీరు తెచ్చిన స‌మాచారంతోనే భావిత‌రాల భ‌విష్య‌త్తు బాగుండ‌డం కోసం ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో నిర్ణ‌యిద్దామ‌ని అన్నారు. రాజ‌కీయాల‌కు వేల‌ కోట్లు అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్తశుద్ధితో పోరాడితే ప్రజలు మ‌న వెన‌క ఉంటార‌ని జ‌న‌సైనికుల‌కు దిశానిర్దేశం చేశారు. వేల‌ కోట్లు డ‌బ్బులు ఉంటే అహం‌కారం, త‌ల‌పొగ‌రు పెరుగుతాయ‌ని అన్నారు. స‌హ‌నానికి కూడా హ‌ద్దు ఉంటుంద‌ని, బెదిరించి, గూండాయిజానికి దిగితే భ‌య‌ప‌డొద్ద‌ని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈరోజు ఉద‌యం నుంచి ఫంక్ష‌న్ హాల్ కు భారీగా పవన్ అభిమానులు త‌ర‌లివ‌చ్చారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles