Lok Sabha takes up no-confidence vote అవిశ్వాస పరీక్ష నుంచి బీజేడీ వాకౌట్.. అధిక సమయం కావాలన్న కాంగ్రెస్

Lok sabha takes up no confidence vote bjd walks out

no trust vote, no confidence motion, BJD, Sumitra Mahajan, Bhartruhari Mahtab, bharat ane nenu, biju janata dal, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

Biju Janata Dal (BJD) has staged a walkout as the Lok Sabha is in session for the motion of no confidence. Earlier, veteran Congress leader Mallikarjun Kharge raised the issue of allotment of time. He requested to remove the time restrictions.

అవిశ్వాస పరీక్ష నుంచి బీజేడీ వాకౌట్.. అధిక సమయం కావాలన్న కాంగ్రెస్

Posted: 07/20/2018 11:33 AM IST
Lok sabha takes up no confidence vote bjd walks out

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా కాంగ్రెస్, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో యావత్ దేశం అసక్తికరమైన పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతాయన్న అసక్తిని కనబరుస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే తమకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని బీజూ జనతాదళ్ పార్టీ చర్చకు అవిశ్వాస చర్చ కొనసాగుతున్న తరుణంలో పార్లమెంటు నుంచి వాకౌట్ చేసింది.  

అవిశ్వాసంపై మాట్లాడేందుకు విపక్షాలకు సమయం సరిపోదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే లోక్ సభ స్పీకర్ ను విన్నవిస్తున్న సమయంలో తనకు మైక్ కావాలని తీసుకన్న బీజేపి పక్ష నేత భాతృహరి మహ్తాబ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. ఆపై స్పీకర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన కేశినేని నానిని మాట్లాడాలని చెప్పగా, ఆయన తనకు బదులుగా గల్లా జయదేవ్ ప్రసంగిస్తారని వ్యాఖ్యానించారు. అందుకు స్పీకర్ అనుమతించారు.

ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో అధికార పార్టీకి ఎక్కువ సమయాన్ని కేటాయించిన విధానాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. సాయంత్రం అరు గంటల వరకు కాకుండా ఈ అవిశ్వాస తీర్మాణాన్ని చేపట్టామన్న స్పీకర్ ను ఒక రోజును పూర్తిగా కేటాయించినా.. విపక్షాలకు మరింత సమయాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ వన్డే మ్యాచ్ కు టెస్టు మ్యాచ్ సమయం కావాలని విడ్డూరంగా వుందని వ్యంగవ్యాఖతో బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles