'Question Modi on pre-LS poll promises' ఆవు హిందూ, గొర్రె ముస్లిం మతాలన్ని ఎప్పుడు పుచ్చుకున్నాయి.? ప్రకాశ్ రాజ్

Prakash raj aks when did cow took hindu religion

Prakash Raj Comments On Modi, Karnataka elections 2018, jignesh mevani, Actor Prakash Raj, Gauri Lankesh, Journalist brutal murder, PM Modi, Amit shah, BJP, cow, coconut, Hinduism, #just asking, politics, journalists, karnataka

Actor Prakash Raj said that to divert the attention of the people from issues such as unemployment and spiralling prices of essential commodities, the BJP leaders were trying to polarise people on communal grounds through cow vigilantism and moral policing.

ఆవు హిందూ, గొర్రె ముస్లిం మతాలను ఎప్పుడు పుచ్చుకున్నాయి.? ప్రకాశ్ రాజ్

Posted: 04/06/2018 12:08 PM IST
Prakash raj aks when did cow took hindu religion

తన సోదరి, ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో తీవ్ర దిగ్భ్రాంతిని గురైన సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. అమె నడిచిన బాటలోనే పయనిస్తూ.. బీజేపి పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఆమె హత్య నేపథ్యంలో ప్రధాని మౌనాన్ని వీడాలని డిమాండ్ చేసిన విలక్షణ నటుడు.. అప్పటి నుంచి బీజేపిని టార్గెట్ చేస్తూ జస్ట్ అస్కింగ్ #just asking పేరుతో బీజేపిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనుషుల కన్నా గోవులకే అధిక ప్రాధాన్యత ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు. గోవు, కొబ్బరికాయలు ఎప్పుడు హిందూ మతాన్ని పుచ్చుకున్నాయని ఆయన ప్రశ్నించారు.

మనిషి మనిషిగా చూడలేని మతచాంధాసవాదులు.. మనుషలను కొట్టి, అవసరమైతే చంపీ కూడా గోవులకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారని విమర్శించారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఖర్జూరం, గొర్రె ముస్లిం మతంలో ఎప్పుడు చేర్చారని నిలదీశారు. ఇదే క్రమంలో పసుపు, కాషాయ వర్ణాలకు జాతి లేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూనే.. అణగారిన వర్గప్రజలకు ఎప్పడూ అండగా ఉంటానని తన సోదిర బాటలోనే పయనిస్తానని తేల్చి చెప్పారు.

మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన ప్రకాశ్ రాజ్ పనిలో పనిగా మీడియాకు కూడా చురకలంటిస్తూ.. పాత్రికేయులు ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతున్నారని, ఇది సమాజానికి సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులను శునకాలతో పోలుస్తున్నారని, మనిషిని మనిషిగా చూడలేని వ్యవస్థలో నాయకులుగా చెలామణి అవుతున్న నేతలు సిగ్గుపడాలని అయన దుయ్యబట్టారు. తప్పుడు మాటలు, తప్పుడు సందేశాలు ఇచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు 2500 మందితో ఓ బృందాన్ని తయారు చేసినట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Gauri Lankesh  PM Modi  Amit shah  BJP  cow  coconut  Hinduism  #just asking  politics  journalists  karnataka  

Other Articles