people of state dont own capital may bring agitations: pawan kalyan రాజధాని తమది కాదన్న భావన వస్తే ఉద్యమాలు: పవన్ కల్యాన్

People of state dont own capital may bring agitations pawan kalyan

pawan kalyan, janasena, vijayawada, amaravati, iyr krishna rao, undavalli arun kumar, cpm madhu, cpi rama krishna, regional agitations, AP capital, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan urges if people of state dont own capital, it may bring special telangana agitations in the state after unvieling the book written by ap former chief secretary iyr krishna rao.

రాజధాని తమది కాదన్న భావన వస్తే ఉద్యమాలు: పవన్ కల్యాన్

Posted: 04/05/2018 08:00 PM IST
People of state dont own capital may bring agitations pawan kalyan

ఏపీ రాజధాని విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళితే విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని, అలాంటి పరిస్థితులు రాకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతమైతే మళ్లీ ప్రాంతీయ విభేదాలు చెలరేగే ప్రమాదం ఎంతైనా వుంటుందని అందోళన వ్యక్తం చేశారు. అమరావతి తమది అన్న భావన రాష్ట్ర ప్రజల్లో నెలకొల్పే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు బదులు వ్యాపార, వాణిజ్య ధోరణిలో అలోచించి అడుగులు వేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తూ ముందుకు వెళ్లే క్రమంలో ఏదో ఒక రోజు ప్రత్యేక ఉద్యమాలు అది రాయలసీమ కావచ్చు, లేక ఉత్తరాంధ్ర కావచ్చు ఏదైనా రావచ్చునని అన్నారు.

మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరోసారి ప్రత్యేక తెలంగాణలాంటి ఉద్యమాలు రాకుండా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను,  ప్రజలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. పాలకులు చేస్తోన్న పనుల వల్ల, అసమాతల వల్ల అస్థిత్వ పోరాటాలు ప్రారంభమవుతాయని, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తే ఆ పరిస్థితి రాదని చెప్పారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకుంటారని, అప్పట్లో హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకృతం చేశారని అన్నారు. రాజ‌ధానిలో అంద‌రికీ భాగ‌స్వామ్యం క‌ల్పించ‌క‌పోతే అస‌మాన‌త‌లు పెరిగిపోయి.. క‌ళింగ ఆంధ్ర లాంటి ఉద్య‌మాలు వ‌స్తాయ‌ని హెచ్చ‌రించారు.  

వాణిజ్య ప్రయెజనాలే కానీ ప్రజాప్రయోజనాలేవీ..: ఐవైఆర్

వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని ఎంపిక చేశారని పుస్తక రచయిత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యం కాదని, రాజధానిపై ఏకాభిప్రాయ సాధనకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని అన్నారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని, పాలకవర్గ విధేయుల రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా దీనిని ఎంపిక చేశారని విమర్శించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని, ఆ తర్వాత అమరావతి సమీపంలో రాజధానిని ప్రకటించారని అన్నారు.

పవన్ ఏం మాట్లాడినా సుర్రు మంటోంది: ఉండవల్లి

జనసేనాని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా ప్రజల్లోకి వేగంగా దూసుకెళుతోందని, దీంతో ప్రభుత్వానికి ఎక్కడో  (సుర్రు) కాలుతుందని  సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఎన్ని రోజులుగా ఆగిపోయాయో మీరు చూశారుగా! అవిశ్వాస తీర్మానం మేము పెడతామంటే మేము పెడతామంటున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం పవన్ కల్యాణే కదా!’ అని ఆయన అధికార, విపక్ష పార్టీలను ప్రశ్నించారు. ‘ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడితే ‘నమ్మక ద్రోహి’, పవన్ కల్యాణ్ మాట్లాడితే ‘ఇన్నేళ్లకు నీకు మెలకువ వచ్చిందా?’ అని అంటున్నారని ఉండవల్లి అన్నారు.

అసలు, చంద్రబాబుకు, బీజేపీకి మధ్య ఉన్న గొడవేంటో చెప్పాలి!  ‘ఈ పాచిపోయిన లడ్డూలతో సర్దుకుపోవాలా?’ అని పవన్ కల్యాణ్ ఎప్పుడో కాకినాడ సభలోనే ప్రశ్నించాడు. అప్పుడు పవన్ కల్యాణ్ మనవాడే ఏమీ అనకండీ అన్నవాళ్లే ఇప్పడు అప్పడే ఏం చేశాడని అడుగుతున్నారు. ప్రస్తుత సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం పెద్ద రిస్క్. ఇలాంటి వాడిని ఆశీర్వదించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఒక మనిషి దెబ్బలాడేందుకు బయటకు వచ్చినప్పుడు, ఆ మనిషి వెనుక మనం నిలబడకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతాం. ఆ ద్రోహం చేయొద్దు!’ అని ఉండవల్లి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles