Pawan Kalyan calls for a committee of officials హోదా కోసం పోరాటంపై సమాలోచనలు: పవన్

Pawan kalyan calls for a committee of officials on special status

Jana sena, Pawan Kalyan, TDP, BJP, Amit Shah, chandrababu, andhra pradesh special status, YSRCP, no confidence motion, TDP MPs, janasena kakinada sabha,council of minister, prime minister, PM Modi, Union Govenment, Union Cabinet, Andhra pradesh, politics

The Actor turned Politician and Jana Sena President Pawan Kalyan has opined that there should a committee of officials to bring out the actual figures of funds given by the Centre to Andhra Pradesh. He further said that, JanaSena is planning to hold deliberations with the Left parties to discuss the situation that the BJP and the TDP have led to.

దాగుడుమూతల ఎందుకు..? హోదా కోసం పోరాటంపై సమాలోచనలు: పవన్

Posted: 03/24/2018 06:49 PM IST
Pawan kalyan calls for a committee of officials on special status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఓ వైపు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణం ఇచ్చి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూంటే.. అక్కడ, ఇక్కడ అధికారంలో వున్న పార్టీల మధ్య సాగుతున్న డ్రామాపై జనసేన పార్టీ అధినేత పనవ్ కల్యాన్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ఒకరిపై మరోకరు విమర్శలు, ప్రేమలు, ప్రతివిమర్శలు చాటుకుంటూ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు.

ఎన్డీఏ నుంచి టీడీపీ వైదలగొడంపై స్పందిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడం..  దానికి ప్రతిగా చంద్రబాబు శాసనసభలో అన్ రికార్డుగా సుదీర్ఘంగా జవాబు ఇవ్వడం చూస్తుంటే ప్రత్యేక హోదా బీజేపీ ఎప్పటికీ ఇవ్వదని అనిపిస్తోందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇటు టీడీపీ కూడా ప్రత్యేక హోదాను సాధించే స్థితిలో లేదన్న విషయం ప్రజలకు అర్థమవుతుందని ఆయన విమర్శించారు.

అటు అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్ కువేలాది కోట్లు ఇచ్చామని.. ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలమైందని పాడిన పాటనే మళ్లీ పాడారని.. ఎప్పటిలాగానే ఆంద్రప్రదేశ్ .. బీజేపీ అన్యాయం జరిగిందని మరోసారి ఘోషించారు. ఎందుకీ దాగుడుమూతలు?. కేంద్రం ఎంత ఇచ్చిందో.. ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో సంయుక్తంగా కమిటీ వేసి ప్రజలకు లెక్కలు చెప్పాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు.
 
జనసేన చొరవతో ఏర్పాటైన సంయుక్త నిజనిర్థారణ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయవచ్చుగా? అని ప్రశ్నించారు. ఎంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముసుగులో గుద్దులాట అడుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విసిగి వేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలకు దిగే పరిస్థితులను దయచేసి కల్పించ వద్దని జనసేన పార్టీ కోరుతుందని విన్నవించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప.. మిగిలిన వాటి గురించి రాష్ట్ర ప్రజలు అలోచిందే అవకాశమే లేదనే యదార్థాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిదని జనసేనాని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిపై చర్చించేందుకు త్వరలో వామపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కాంక్షను నెరవేర్చాందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఈ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఆ తరువాత లోక్ సత్తా అద్యక్షడు  జేపీ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మేధావులతో కూడా సమాలోచనలు జరుపుతామని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  TDP  BJP  Amit Shah  chandrababu  andhra pradesh special status  politics  

Other Articles