AP budget with nearly Rs 2 lakh crore రూ.1,91,063 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. లక్షన్నర కోట్లపైగా అర్థిక లోటు..

Yanamala presents ap budget in assembly with fiscal deficit of rs 1 5 lakh cr

andha pradesh assembly, andhra pradesh budget, yanamala ramakrishna budget, andhra pradesh, yanamala ramakrishnudu, yearly budget, fiscal deficit, centre, arun jaitley, PM Modi, Economics, andhra pradesh gdp rate, leader of the opposition, YSRCP party chief ys jagan, andhra pradesh special status, andhra pradesh special package, andhra pradesh politics

After getting the formal approval of the Council of Ministers, Finance Minister Yanamala Ramakrishnudu presented the budget in the AP Legislative Assembly on Thursday with nearly Rs 2 Lakh crore with a fiscal deficit of Rs. 1,50,271 Cr.

కేంద్రం నిధులివ్వకపోయినా.. అభివృద్ది, సంక్షేమాలకు పెద్దపీట..

Posted: 03/08/2018 12:04 PM IST
Yanamala presents ap budget in assembly with fiscal deficit of rs 1 5 lakh cr

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని, అందుకోసం అన్ని వర్గాల వారి అభున్యతికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ముఖ్యఉద్దేశ్యమని అందుకు కట్డుబడే తమ బడ్జెట్ వుంటుందని ఆయన చెప్పారు. ఇవాళ అమరావతిలోని అసెంబ్లీలో బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. మొత్తంగా లక్ష 91 వేల 63 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా, లక్ష యాభై వలే 271 కోట్ల రూపాయలను అర్థిక లోటు వుందని యనమల గణంకాలను సభ ముందు పెట్టారు. గత ఏడాదితో పొల్చితే ఈ సారి 21.7శాతం బడ్జెట్ పెరిగిందని అంచనా వేశారు.

కేంద్రం నుంచి నిధులు రాక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హామీలు అచరణ రూపం దాల్చకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని యనమల బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందాల్సిన సాయం అందకపోయినా.. ఒక చేత్తో అభివృద్ది.. మరో చేత్తో సంక్షేమాలను కొనసాగిస్తూ వస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనతో అదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్ర ఆదాయాంపై పెను ప్రబావాన్ని చూపించదని, తీరని నష్టం కలిగించిందని అన్నారు.  సమస్యల వలయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశామని యనమల చెప్పారు. ఫలితంగా గత ఏడాది రాష్ట్రంలో 10.96 శాతం వృద్దిరేటు సాధించామని యనమల చెప్పుకోచ్చారు.

బడ్జెట్ లోని కీలక కేటాయింపులు ఇవే:

* వ్యవసాయానికి రూ.12,352కోట్లు
* సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు.
* ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు
* రవాణా శాఖకు రూ.4,653కోట్లు
* గృహ నిర్మాణ శాఖకు రూ.3,679కోట్లు
* సాధారణ సేవల కోసం రూ.56,113.17కోట్లు
* సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ.224.81కోట్లు
* విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు
* క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ.818.02కోట్లు
* కళ, సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4,100కోట్లు
* హోంశాఖకు రూ.6,226కోట్లు
* పర్యాటక శాఖకు రూ.290కోట్లు
* తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు
* ఫైబర్‌ గ్రిడ్‌ కోసం రూ.600కోట్లు
* సామాజిక భద్రత కోసం రూ.3,029కోట్లు
* స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు
* ఎన్టీఆర్‌ జలసిరి కోసం రూ.100కోట్లు

సంక్షేమ దిశగా..

* బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు
* కాపుల సంక్షేమానికి రూ.1,000కోట్లు
* నాయీ బ్రాహ్మణుల కోసం రూ.30కోట్లు
* వైశ్యుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
* కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70కోట్లు
* మేదరుల సంక్షేమానికి రూ.30కోట్లు
* చేతివృత్తులకు ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
* చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద రూ.250కోట్లు
* జనతా వస్త్రాల సరఫరా కోసం రూ.200కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100కోట్లు, బీసీలకు రూ.100కోట్లు
* ఆర్థికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు బోధన ఫీజు కోసం రూ.700కోట్లు
* కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు
* డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు
* వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు
* పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు
* మెడ్‌ టెక్‌ జోన్‌ కోసం రూ.270కోట్లు
* అన్నా క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles