Hot Calling Gang Busted in Bhongir | హాల్లో.. స్వీట్ వాయిస్... డర్టీ టాకింగ్... భువనగిరిలో ’సెక్సీ‘ స్కాండల్

Hot calling gang busted in bhongir shocking relavations by victim

Hot Calling, Dirty Talking, Sexy Talking with Customers, Hot Calling with Husky Voice Girls, Girls Hot Phone Talk, Phone Sex, The husky voice of seduction, Nalgonda Sex Racket, Yadadri Hi-tech Sex Racket

Police busted a hot calling gang in Meena Nagar, Bhuvanagiri Town of Nalgonda District. A victim revealed her shocking experience, who was trapped on pretext of huge salary and forcibly done the job after singing the contract.

కటకటాల్లో ‘డర్టీ’ కాలింగ్ గ్యాంగ్.. మంచి జీతం పేరుతో యువతులకు ట్రాప్..

Posted: 02/06/2018 01:57 PM IST
Hot calling gang busted in bhongir shocking relavations by victim

ఈజీ మని వేటలో మరో డర్టీ వ్యాపారానికి తెరతీస్తున్నారు అక్రమార్కులు. అయితే తమతో పనులు జరగవని తెలిసి.. మంచి జీతం పేరుతో అమ్మాయిలను ఎరవేస్తున్నారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందితో కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్న ముఠా గుట్టు భువనగిరిలో రట్టయ్యింది. ఈ ట్రాప్ లో చిక్కుకున్న ఓ అమ్మాయికి కాల్ సెంటర్ పేరుతో ట్రాప్ చేసి.. అమెకు అయిష్టత వ్యక్తం చేస్తున్నా.. అగ్రిమెంట్ పేరుతో భయాందోళనకు గురిచేసి.. అమెతో బలవంతంగా డర్టీ కాలింగ్ చేయించారు. అది భరించలేక అమె తన సహోద్యోగుల వద్ద అవేదనను వ్యక్తం చేయగా, అందరూ లైట్ తీసుకోమన్న వాళ్లే కానీ, నిర్వాహకుడి అటకట్టించేందుకు ఏఒక్కరూ ముందుకురాలేదు. దీంతో అమె ఒక్కతే ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. మొత్తం గ్యాంగ్ కటకటాల వెనక్కి వెళ్లారు.

కాల్ సెంటర్ ఉద్యోగం పేరుతో.. సెక్సీ సంబాషణలు

మంచి జీతం.. కష్టపడాల్సిన పనిలేకుండానే జీతం.. కేవలం కస్టమర్లతో ఫోన్ సంబాషణలు చేస్తే చాలు అంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. టార్గెట్లు లేవు.. దొరికిన కస్టమర్ ను గంటల కొద్ది లైన్ లో సంబాషణ చేయడమే పని.. నెలకు ఠంచనుగా జీతం అంటే అలాంటి జాబ్ తనకు వస్తుందా.. అని అశపడే వాళ్లూ లేకపోలేదు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వీళ్లకు కాల్ చేసిన కస్టమర్లతో చేయాల్సింది సెక్స్ సంభాషణలు అదేనండీ డర్టీ టాకింగ్.

భారత సంస్కృతీ సంప్రదాయాలను గంగలో కలుపుతూ యువతుల చేత.. పరాయి పురుషులతో హస్కీ వాయిస్ లో రెచ్చగోట్టే విధంగా మాట్లాడాలి. హిందూ మహిళలు తమ భర్తలతోనూ చెప్పుకోలేని విధంగా వారిని అనైతిక సంబాషణలను చేయాలని బలవంతం చేస్తారు. ఇక మీరు ఎవరు అన్న విషయం ఫోన్ లో మాట్లాడేవారికి తెలియదు.. మీ ముఖం కూడా వారు చూడరు. కేవలం మాటలే కదా.. ఒకటి రెండు రోజులు ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ తరువాత మీ నెంబరుకు ఫోన్ ఎవ్పుడు వస్తుందా అని మీరే ఎదురుచూస్తారు అంటూ ప్రేరణ కలిగిస్తారు.

బలవంతంగా యువతులతో మానసిక వ్యభిచారం..

తమకు ఇలాంటివి ఇష్టం లేదని, ఎదో కాల్ సెంటర్ ఉద్యోగమంటే వచ్చామే తప్ప.. ఇక్కడ పరపురుషులతో కామవాంఛను రగుల్చుతూ మాట్లాడటం.. మానసిక వ్యభిచారం చేయడం తమకు ఇష్టం లేదని అయిష్టతను తెలిపినా.. వారిని వదిలిపెట్టరు. తమ వారితో ఎలాగైనా పని చేయించుకోవాలని కాల్ సెంటర్ నిర్వహకుడు ముందుగానే అమ్మాయిలతో అగ్రిమెంట్ పై సంతకాలు చేయిస్తాడు. ఆ తరువాతే వారికి వివరాలను తెలిపుతాడు. ఇక వారిపై ఒత్తిడి చేసి మరీ డర్టీ టాకింగ్ చేయిస్తారు.

ఎవరైనా ఎదరుతిరిగితే.. వారు సంతకాలు పెట్టిన అగ్రిమెంట్ కాగితాలు చూపించి బెదిరింపులకు దిగుతారు. ఇలా ఈ సంస్థలో చేరిన ఓ యువతి అమెకు ఇష్టం లేదని చెప్పినా అమెతో బలవంతంగా ఈ పనులు చేయించారు. దీంతో సదరు బాధితురాలు భువనగిరి పోలీసులను ఆశ్రయించగా, 'హాట్ కాలింగ్' గ్యాంగ్ బండారం బట్టబయలైంది. పోలీసులు దాడి సమయంలో ఈ కాల్ సెంటర్లో 12 మంది యువతులు ఫోన్ల ముందు కూర్చుని పట్టుబడ్డారు. అయితే మొత్తంగా 20 మంది ఈ కాల్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ కేసులో కాల్ సెంటర్ నిర్వాహకులు వీరస్వామి, భవానీలను అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి భువనగిరి ప్రాంతానికి వచ్చిన వీరస్వామి భవానితో పరిచయం పెంచుకుని ఈ మానసిక వ్యభిచారానికి తెరలేపాడని పోలీసులు చెప్పారు.

ఎలా ట్రాప్ చేస్తారన్నది బాధితురాలి మాటల్లోనే..

మీ గొంతు చాలా బాగుంది, కాల్ సెంటర్ లో కస్టమర్లతో మాట్లాడటానికి మీలాంటి వారే కావాలి. మీకు మంచి జీతం కూడా ఇస్తాం. సుమారుగా 20 వేల రూపాయల ఉద్యోగం ఇస్తామని యువతులను ట్రాప్ చేస్తారని, తీరా అశపడి అక్కడకు వెళ్తే.. ముందుగా అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టిస్తారని.. ఆ తరువాతే తాము చేయాల్సిన పనులు చెబుతారని బాధితురాలు తెలిపింది. అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారి నుంచి అసలు విషయం తెలియగానే యువతులు తీవ్ర ఆందోళనకు గురవుతారని అవేదన వ్యక్తం చేసింది.

తమకు పాడు పనులు చేసేందుకు కూడా ధైర్యం సరిపోదని యువతులు ఎవరైనా మిన్నకుండిపోతే.. వారిని నిర్వాహకుడు భవానీ అనే మహిళ ద్వారా ప్రేరణ కలిగించేలా చేస్తాడని, అమె అలాంటి యువతుల వద్దకు వచ్చి.. కేవలం ఫోన్ లో మాటలేకదా.. మీకు మీరు మాట్లాడుతున్న కస్టమర్ ఎవరన్నది ఎలా తెలియదో.. అవతలి వ్యక్తికి కూడా వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదని, వారి ముఖాలు కూడా తెలియదు కాబట్టి, భయం లేకుండా మాట్లాడవచ్చని చెప్పతుందని బాధితురాలు తెలిపారు. ఇక తాను కస్టమర్లను తీసుకొస్తే భారీగా కమిషన్ ఇస్తానని ఆశ కూడా పెట్టిందని చెప్పుకొచ్చింది.

ఆక్కడి వారికి ఔట్ గోయింగ్ సౌకర్యం లేని సిమ్ కార్డులు, రికార్డింగ్ సౌకర్యం లేని ఫోన్లు ఇస్తారని, వాటికి ఎవరైనా కాల్ చేస్తే, వారితో బూతు మాటలు మాట్లాడుతూ, వారికి కావాల్సిన విధంగా శృంగార సంభాషణలు జరపాల్సి వుంటుందని వెల్లడించింది. కస్టమర్లు తమ కాల్ ను కట్ చేయకుండా ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత బాగా వారిని ఎంటర్ టెయిన్ చేసినట్టని చెప్పేవారని, జీతంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆశ పెట్టారని బాధితురాలు చెప్పింది. తాను ఇమడలేక, ఆ విషయాన్ని తోటి ఉద్యోగినులకు చెబితే, అందరూ 'లైట్ తీస్కో'మని సలహా ఇచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని వాపోయింది. చివరకు తాను ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nalgonda  Yadadri District  Hi-tech Sex Racket  

Other Articles