Pawan Clarifies Vote Bank Politics Not Jana Sena Agenda | ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు, మార్పుపై దృష్టి సారించాలి : పవన్

Pawan speech at khammam yatra

Jana Sena Party, Pawan Kalyan, Political Yatra, Telangana, Pawan Kalyan Khammam, Jana Sainks, Pawan on Nalgonda Fluorosis Issue, Pawan Kalyan Political Tour

Jana Sena Chief Pawan Kalyan continues political tour in Telangana. Pawan interaction with Jana Sainiks belongs to South Telangana Districts in MB Gardens, Khammam. Pawan Clarified Vote Bank Politics Not Jana Sena Agenda.

ITEMVIDEOS: రాజకీయాలతోనే సామాజిక మార్పు సాధ్యం

Posted: 01/24/2018 07:17 PM IST
Pawan speech at khammam yatra

మానవత్వంతో కూడిన రాజకీయాలే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాయాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పవన్ అనంతరం ఎంబీ గార్డెన్స్‌లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

నావి ఓటు బ్యాంకు రాజకీయాలు కావు.. రాజకీయాలతోనే సామాజిక మార్పు వస్తుందన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశాడు. తనను ప్రేరేపించిన బలమైన కారణాల్లో నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని పవన్ ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం రాజకీయాల్లోకి ఉడుకు నెత్తురుతో మరుగుతున్న యువత కావాలి. సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా రాజకీయాల్లో మార్పుల తీసుకురాలేం. దేశంలో కులాలు అంతం కావాలని, తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టి సారించాలని అన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు అవసరం. ఆ ఆశయ సాధనతోనే జనసేన ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. తనపై దాడి చేసినా.. విమర్శించిన భరిస్తానన్న పవన్... మానవత్వ రాజకీయాల కోసం ఎందాకైనా వెళ్తానని చెప్పారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా రూపు మాపేవరకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు.

Pawan on Politics

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకాగా.. వారిని ఉద్దేశించి పవన్ పలు సూచనలు చేశారు. సమస్యలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లండి. సాంఘిక సంక్షేమ హస్టళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి. తెలంగాణలో ప్రజలు అభివృద్ధి చెందాలంటే పార్టీలన్నీ సమిష్టి కృషి అవసరం. అందుకే అందరినీ కలుపుకుని ముందుకెళ్దాం. మన భాష మన యాసను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫీల కోసం కాకుండా సమస్యలపై పోరాడాలని.. అంబేద్కర్,పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పవన్ కోరారు. విగ్రహాల ఆరాధన కంటే.. ఆశయాల సాధన కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇక విమర్శలపై స్పందిస్తూ... ప్రభుత్వాల సాయం తీసుకోదల్చుకుంటే తనకు అమరావతిలో పార్టీ ఆఫీసు ఏర్పాటుకు సమస్యలే ఎదురయ్యేవి కావు కదా అని పవన్ తెలిపారు. తనది లెఫ్ట్-రైట్ వింగ్ కాదని.. ప్రజల ప్రక్షమని.. సమస్యలు ఎక్కడుంటే తాను అక్కడ చేరి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని కుండ బద్ధలు కొట్టాడు. ఇక తనతో కలిసి వస్తే తెలంగాణ సమస్యలను చూపిస్తానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు పవన్ చురకలంటించాడు. కాంగ్రెస్ హైకమాండ్ గనుక వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను అందుకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని అడ్డుకోవటం ఎవరి వల్లా కాదన్న పవన్.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతూ సెలవు తీసుకున్నారు.

PK Speech at Khammam

చివర్లో ఓ మహిళ పవన్ కి అభినందనలు తెలియజేసేందుకు వేదిక మీదకు చేరే యత్నంలో.. పవన్ ఆమెను గమనించి స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఆపై ఆమె పాదాలకు అభివాదం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక వికలాంగ అభిమానులు పవన్ ను పలకరించగా.. ఆయన అప్యాయంగా అక్కున్న చేర్చుకున్నారు. 

PK blessed by woman

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles