2 killed in US drone strike in NW Pakistan ఒబామా బాటలోనే ట్రంప్..పాక్ పై ద్రోణి స్ట్రైక్

Suspected us drone strike kills haqqani militants in pakistan

United states drone strike on Pakistan, Haqqani Network, Pakistan, Surgical strike, America, Donald Trump, Barack Obama, Dapa Mamuzai, Kurram tribal area, pakistan, United states, drone strike

Two militants from Haqqani network killed in a drone strike by United states in Pakistan. Pakistani officials and police say two missiles fired from a U.S. drone have struck a home near the Afghan border.

పాకిస్తాన్ కు దిమ్మదిరిగేలా అగ్రరాజ్యం షాక్..!

Posted: 01/24/2018 05:09 PM IST
Suspected us drone strike kills haqqani militants in pakistan

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా మరో షాకిచ్చింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని పదే పదే పలుమార్లు చెప్పినా పాకిస్థాన్ పెడచెవిన పెట్టిన నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగింది. మీరు కాకపోతే మేమే రంగంలోకి దిగుతామని పాక్ కు షాకిచ్చింది. లష్కరే తోయిబా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు అశ్రయం కల్పించిన పాకిస్థాన్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాటించిన విధానాన్నే తాజా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అచరించారు.

పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా ద్రోన్ దాడులు జరిపింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై డ్రోన్ సాయంతో డాడి చేసింది. ఈ దాడిలో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన ఓ కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో, డ్రోన్ తో అమెరికా బలగాలు దాడి చేశాయి. నిర్దేశిత స్థలంపై రెండు మిస్సైళ్లను వదిలాయి.

ఆఫ్ఘాన్ ను అతలాకుతలం చేస్తున్న తాలిబన్లతో హక్కానీ నెట్ వర్క్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో, ఈ నెట్ వర్క్ ను తుద ముట్టిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హక్కానీ నెట్ వర్క్ కమాండర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ కు ఆర్థిక సాయాన్ని కూడా అమెరికా నిలిపివేసింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిని పాకిస్థాన్ ఖండించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Barack Obama  Dapa Mamuzai  Kurram tribal area  pakistan  United states  drone strike  

Other Articles