CM orders probe on threat calls to fodder scam judge జడ్జీని బెదిరించిన న్యాయమూర్తులు..

Cm orders probe into reports that dm sdm called fodder scam judge

fodder scam case, lalu prasad yadav, Ranchi cbi court, special cbi judge, Shivpal singh, threat calls, mannan akthar, probe, mruthunjay kumar, Chief Minister, yogi adithyanath, crime

Chief Minister Yogi Adityanath ordered an inquiry into media reports about alleged calls made by the district magistrate (DM) and a sub-divisional magistrate (SDM) of Jalaun district to Justice Shivpal Singh

జడ్జీని బెదిరించిన న్యాయమూర్తులు.. విచారణ

Posted: 01/11/2018 11:53 AM IST
Cm orders probe into reports that dm sdm called fodder scam judge

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్ పై నమోదైన దాణా కుంభకోణం కేసులో తీర్పును వెలువరించేందుకు ముందుకు సంబంధిత రాంఛీ సీబిఐ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఈ ఫోన్ కాల్స్ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన న్యాయమూర్తుల నుంచే వచ్చాయన్న కథనాలు మరింత కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన యోగీ అధిత్యనాథ్ సర్కార్.. విచరాణ కమిటినీ ఏర్పాటు చేసింది. నిజానిజాలను వెలికి తిసి నివేదికను తమకు సమర్పించాలని అదేశించింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్‌ జిల్లా న్యాయమూర్తి మనన్ అక్తర్ తో పాటు, సబ్‌ డివిజినల్‌ న్యాయమూర్తి కూడా కలసి రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ తో తీర్పు వెలువరించిక ముందే ఫోన్‌లో సంబాషించారని వార్తలు వచ్చాయి. అర్జేడి అధినేత లాలూకు విధించే శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్‌ ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్‌ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో సంచలనంగా మారింది.

పత్రికలలో ప్రముఖంగా ప్రచురించిన ఈ వార్తలను ప్రభుత్వం సిరీయస్ గా తీసుకుంది. రంగంలోకి దిగిన యోగీ అధిత్యనాథ్ సర్కార్ ఈ యావత్ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్‌ మీడియా సలహాదారు మృత్యుంజయ్‌ కుమార్‌ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని  ఝాన్సీ కమిషనర్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు.

మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్‌ సింగ్‌ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్‌లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్‌తో తాము చర్చించినట్లు సబ్‌ డివిజినల్‌ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్‌ అక్తర్‌ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles