Fire snatches laughing birthday girlముంబైలో విషాదం.. జన్మదినం రోజునే యువతి సజీవదహనం

28 yr old celebrating birthday among 14 killed in kamala mills fire

Khushboo Mehta, 28-yr-old dies in Mumbai fire, 28-yr-old dies on her birthday, Kamala Mills compound, Kamala Mills fire, One Above restaurant, Mumbai incident, Maharashtra news

11 of the dead were women and most of the bodies were found near a women's washroom, witnesses said. The video captured on a mobile phone showed Khushboo cutting a chocolate cake while laughing and joking with them. 'Happiest Birthday Khushi', the video was captioned.

ముంబైలో విషాదం.. జన్మదినం రోజునే యువతి సజీవదహనం

Posted: 12/29/2017 08:11 PM IST
28 yr old celebrating birthday among 14 killed in kamala mills fire

పుట్టిన రోజు నాడు మిత్రులందరితో కలసి వేడుకలు చేసుకుంటున్న అమెకు తెలియదు ఆ మరసటి క్షణంలో ఏం జరుగుతుందోనని. అందుకనే అప్పటి వరకు అనందంగా వేడుకలలో తలమునకలైన వారు.. మరు నిమిషంలో విఘత జీవులయ్యారు. అకస్మాత్తుగా రేగిన మంటలు వారిని సజీవంగా కబళించివేశాయి. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువతితో పాటు అమె స్నేహితులు కూడా సజీవదహనమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖుషీ కూడా తన పుట్టిన రోజునాడు నవ్వుతూ, తుళ్ళుతూ మజా చేసుకోవాలనుకున్నారు. ఆమె 28వ జన్మదినం సందర్భంగా ‘1 అబౌవ్’ పబ్‌లో స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశారు. గురువారం- శుక్రవారం మధ్య రాత్రి 12.30 గంటలకు కేక్ కట్ చేశారు. స్నేహితుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు అందుకుని, సంతోషించారు. ఆ సంతోషం, ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అనూహ్యమైన దుర్ఘటన ఆమెతోపాటు ఆమె స్నేహితురాలిని కూడా బలి తీసుకుంది.
 
ముంబైలోని సేనాపతి బాపట్ మార్గంలో ఉన్న కమల మిల్స్ కాంపౌండ్‌లో ‘1 అబౌవ్’ పబ్ ఉంది. మూడో అంతస్థులో ఉన్న ఈ పబ్‌లో అనూహ్యంగా మంటలు వ్యాపించడంతో బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖుషీతోపాటు ఫ్రెండ్స్ అంతా ఒకే చోట ఉన్నారు. అక్కడ ఎగసిపడుతున్న మంటల్లో ప్లాస్టిక్ షీట్లు కూడా తగలబడ్డాయి. పొగ తీవ్రంగా వ్యాపించింది. దీంతో చాలా మంది పారిపోయినప్పటికీ 15 మంది ఊపిరి ఆడకపోవడంతో మరణించారు. మరణించినవారిలో ఖుషీ కూడా ఉన్నారు.
 
ఆమె జన్మదినోత్సవం నాడే ఇంత దారుణం జరిగినట్లు తెలుసుకున్నవారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖుషీ తాతగారు బాబూలాల్ మెహతా మాట్లాడుతూ రెస్టారెంట్ యజమానిపై తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా ప్రమాణాలను, నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. యజమాని దురాశ వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు, 21 మంది గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khushboo Mehta  1 Above" restaurant  Kamala Mills Compound  mumbai police  crime  

Other Articles