kapu reservation bill passed in state assembly కాపు రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ తీర్మాణం..

Kapu reservation bill passed in ap assembly

kapu community, kapu, andhra pradesh government, andhra pradesh govt, chandrababu naidu, andhra pradesh cm, mudragada padmanabham, mudragada, mudragada strike, mudragada kapu reservation, ap assembly kapu reservation, R krishnaiah, politics

Based on Manjunatha commission report, Andhra pradesh governments passes kapu reservation bill in assembly after cabinet approval in the morning.

కాపు రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ తీర్మానం

Posted: 12/02/2017 12:02 PM IST
Kapu reservation bill passed in ap assembly

దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి బ్రిటీష్ కాలం వరకు కూడా వెనకబడిన తరగతుల జాబితాలో వున్న కాపులకు స్వాతంత్ర్య తరువాత అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి అగ్రవర్ణ జాబితాలో చేర్చారని దానిని గుర్తించి కాపులకు అండగా నిలవాలని తమ ప్రభుత్వం వారిని వెనకబడిన తరుగతుల జాబితాలోకి చేర్చుతూ ఇవాళ అసెంబ్లీలో బిల్లును పాస్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపులెవరూ తనను అడగలేదని కూడా స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గత మూడున్నరేళ్ల క్రితం తాను చేసిన పాదయాత్ర సందర్భంగా కాపు సామాజికవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి తానే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ హామీ ఇచ్చానని చెప్పారు. దానిని అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చి రాగానే మంజునాథ కమీషన్ కూడా వేశామని చెప్పారు. కాపుల అభ్యున్నతికి కట్టుబడి వున్నామని, అందుకనే వారి ప్రత్యక బోర్డును ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల నిధులను కూడా కేటాయిస్తున్నామని చెప్పారు.

అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర జనాభాలో కాపులు 8.72 శాతం ఉన్నారని తెలిపారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ కలిపి 11 శాతం ఉన్నారని చెప్పారు.  బ్రిటీష్ కాలంలో కాపులకు రిజర్వేషన్ ఉండేదని... ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రిజర్వేషన్లను తొలగించారని తెలిపారు. 2016లో కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు.

ఇతర బీసీలకు అన్యాయం జరగకుండా కొత్తగా 'బీసీ ఎఫ్' ను ఏర్పాటు చేస్తున్నామని... 4 నుంచి 5 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని కమిషన్ సూచించగా, 5 శాతానికే మొగ్గు చూపామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu  reservation  chandrababu  mudragada padmanabham  kapu reservation  R krishnaiah  andhra pradesh  

Other Articles