Kids' plates in toilet scrub తలచుకుంటేనే డోకు.. అన్నం తినే ప్లేట్లతో..

Primary school children asked to clean toilet with mid day meal plates

Damoh district of Madhya Pradesh, primary school children made to clean toilets, mid day meal plates used to clean toilets, doli village of madhya pradesh, primary school, doli, students, toilets, mid day meal plates, Damoh, swachh bharat, Madhya Pradesh, latest news

In a shocking incident, news of school children being made to clean toilet with the plates of mid day meal has surfaced from Doli village in Damoh district of Madhya Pradesh (MP).

తలచుకుంటేనే డోకు.. అన్నం తినే ప్లేట్లతో..

Posted: 11/11/2017 09:26 AM IST
Primary school children asked to clean toilet with mid day meal plates

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాభారత్ అన్న నినాదంతో బోజనానికి ముందు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని దేశప్రజలకు పిలుపునిస్తుంటే.. విద్యార్థులను స్వచ్ఛాభారత్ బాటలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ.. విద్యార్థులు ఎప్పుడు.. ఎక్కడ ఏ ప్లేటులో బోజనం చేసినా.. తాము ఎదుర్కోన్న ఘటనను తలచుకుంటే చాలు డోకు వచ్చేలా మారిందీ పరిస్థితి. అసలేం జరిగింది..? అంటే..

మధ్యప్రదేశ్‌, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అక్కడి ఉపాధ్యాయులు పిల్లల పట్ల దారుణంగా వ్యవహరించారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు పాఠశాల టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. ఇంటికెళ్లిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చేయించిన పని గురించి వారి తల్లిదండ్రులతో చెప్పారు.

దీనిపై అగ్రహోక్తులైన తల్లిదండ్రులు.. టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వారంతా పాఠశాల వద్దకు చేరుకుని క్రితంరోజున ఆందోళన చేపట్టారు. అయితే పిల్లల తల్లిదండ్రుల ఆరోపణలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని చెప్పారు. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉందని, అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై వార్తలువెలువడడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : primary school  doli  students  toilets  mid day meal plates  Damoh  swachh bharat  Madhya Pradesh  

Other Articles