4-day state bank holiday triggers cash crisis fear పండుగ పర్వదినాన నగదు కొరత అందోళన..

6 day state bank holiday triggers cash crisis fear

Bengal, Banks, SBI, gandhi jayanti, dussera, bank holidays, ATM centers, cash withdrawl, India, demonetisation, salaried persons

The Kolkata city may run into a funds crisis in the middle of festivities with banks shutting down for six consecutive days from Wednesday on acc-ount of Durga Puja followed by a Sunday and Gandhi Jayanti.

పండుగ పర్వదినాన నగదు కొరత అందోళన..

Posted: 09/27/2017 01:01 PM IST
6 day state bank holiday triggers cash crisis fear

దేశవ్యాప్తంగా దసరా పండుగలను హింధువులు ఘనంగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా నవరాత్రులలో నిష్టతో ఉపవాస దీక్షలను అచరించి.. దసరా రోజున వదులుతారు. అయితే దసరా పర్వదినం రోజున మేము కూడా ఘనంగా జరుపుకుంటామని బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, సిబ్బంది అనడంతో ప్రజలు ఖంగుతింటున్నారు. దసరా సెలవులతో పాటు అదివారం. గాంధీ జయంతి వేడుకలు అన్ని వరుసగా కలసిరావడంతో బ్యాంక్ ఉద్యోగులకు వరుసగా అరు రోజు సెలవులు వచ్చాయి.

దీంతో బ్యాంకులు పనిచేయకపోవడంతో పాటు.. ఏటీయం కేంద్రాలలో నగదు నిల్వలు కూడా తగ్గిపోవడంతో నగదు కొరత ఏర్పడే అవకాశం వుంటుందని ప్రజలు అందోళన చెందుతున్నారు. దసరా పండగ రోజుల ప్రజలకు మరోమారు డీమానిటైజేషన్ రోజులను గుర్తుకు రానున్నాయని పలువురు వ్యంగ వ్యాఖ్యాలు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మాత్రం కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకోంది. మరీ ముఖ్యంగా కొల్ కతా నగరంలో ఈ అందోళన రేగనుంది.

పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. అయితే గతేడాది అక్టోబరు 6 నుంచి 12 వరకు బ్యాంకులు మూతపడినా అకౌంట్లలో వేతనాలు వచ్చేందుకు పెద్ద సమస్యగా అవతరించలేదని, అయితే ఈ సారి మాత్రం వేతనాల వచ్చే నెల అందుకోవాల్సి రావడం.. దీంతో అందరూ ఒకేసారి ఏటీయం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేయడంతో నగదు కోరత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు వున్నాయని వేతన జీవులు అంగలార్చుతున్నారు.

అయితే పండుగల వేళ, ఆ తరువాత వేతన జీవుల విత్ డ్రాల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల అధికారులు ప్రకటించారు. బ్యాంకు అధికారులు చెప్పినట్లు జరుగుతుందో.. లేక మరోమారు గతేడాది కేంద్రం చేపట్టిన డీమానిటైజేషన్ పరిస్థితులను ఉత్పన్నం కాకున్న.. ఆ పాత రోజులను మళ్లీ గుర్తుకు తెస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles