India slams Pakistan at UN, calls it 'Terroristan' పాకిస్థాన్ పరిపూర్ణ టెరరిస్తాన్.. ధాయాధికి ధీటైన జవాబు..

India slams pakistan at un calls it terroristan

Pakistan India UN,UNGA,India at UNGA,Eenam Gambhir, Pakistan Prime Minister, Shahid Khaqan Abbasi, united nations, Kashmir dispute, kashmir, Jammu and kashmir, India-Pakistan, latest news

Pakistan is now "Terroristan" - the land of pure terror, India said in a formidable rebuttal at the UN to Pakistani Prime Minister Shahid Khaqan Abbasi

ITEMVIDEOS: పాకిస్థాన్ స్వచ్ఛమైన టెరరిస్తాన్.. ధాయాధికి ధీటైన జవాబు..

Posted: 09/22/2017 11:45 AM IST
India slams pakistan at un calls it terroristan

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో తన తొలి ప్రసంగాన్ని వినిపించిన పాకిస్థాన్‌ ప్రధాని షహీద్‌ ఖకాన్‌ అబ్బాసీ భారత్‌ కోల్డ్‌ స్టార్ట్‌ యుద్ధ విధానం, కాశ్మీర్ లో వేర్పాటువాదలను ఎలా అణిచివేస్తుందన్న అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో ధాయాధికి భారత్ కూడా ధీటైన జవాబునిచ్చింది. కశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి ఓ ప్రత్యేక దూతను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ కార్చిన మొసలి కన్నీరును భారత్ పటాపంచలు చేస్తూ వాస్తవిక దృశ్యాలను ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచం ముంగిట బట్టబయలు చేసింది. పాకిస్థాన్ ఇప్పుడు ఒక పరిపూర్ణ ఉగ్రవాద దేశమని భారత్ అభివర్ణించింది. పాకిస్తాన్ ఇక టెర్రరిస్థాన్‌ అని నినదించింది.

అగ్రరాజ్యంపై కుట్రలు పన్ని కుతంత్రంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను కూల్చిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు తమ దేశంలో అశ్రయమిచ్చిన పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితికి వచ్చి తాము రాసుకున్న కథలను వినిపించే ప్రయత్నం చేసినా.. నిజాలు దాగవని స్పష్టం చేసింది. లాడెన్ అబోట్టాబాద్ లో అమెరికా దళాలు మట్టుబెట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించింది. ఒకప్పుడు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్.. ఇప్పడు పరిపూర్ణ ఉగ్రవాద దేశంగా బాసిల్లుతుందని ఐక్యరాజ్య సమితిలోని భారత తొలి సెక్రటరీ ఈనమ్‌ గంభీర్‌ అన్నారు.

పాకిస్థాన్‌ అంటే స్వచ్ఛమైన భూమన్న అర్థాన్ని కస్తా ఇప్పుడు అ దేశం మార్చివేసిందన్నారు.. స్వచ్చమైన భూమి కాస్తా.. ఇప్పుడు స్వచ్ఛమైన ఉగ్రవాద భూమిగా మారిపోయిందని భారత్ బదులిచ్చింది. ఏ దేశానికి చెందిన ఉగ్రవాదులైన తమకు రక్షణగా నిలిచే పాకిస్థాన్ కు వచ్చి తలదాచుకుంటున్నారని అరోపించింది. ఉగ్రవాదులకు స్వర్గధామంలా నిలవడమే కాకుండా ఇక ఉగ్రవాదులను  తయారు చేస్తుందని, వారిని ప్రపంచ దేశాల ఉగ్రవాద సంస్థలకు కూడా పంపుతుందని భారత్ కార్యదర్శి ఈనమ్ గంభీర్ అన్నారు.

ఇక తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల నేతలకు రాజకీయ నేతలుగా మార్చి వారికి రక్షణ కూడా కల్పిస్తుందని దుయ్యబట్టారు. ఇందుకు లష్కరే తోయిబా నేత, భారత మోస్టు వాంటెండ్ జాబితాలో వున్న హఫీజ్ మహమ్మద్ సయీద్ ను ఉదాహరణగా పేర్కోన్నారు. తాను త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని గత కొంత కాలం క్రితం ఆయన చేసిన ప్రకటనలను కూడా భారత్ ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చింది.

చేతిలో తుపాకులు పట్టుకుని పట్టపగలు ఉగ్రవాదులు యదేశ్చగా వీధుల్లో విహరిస్తుంటే తమ దేశంలోని సాధారణ ప్రజానికమే ఎక్కడ ఏప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళనలోకి జారుకుంటున్నా.. వారికి భయాన్ని దూరం చేయాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం.. తన దృష్టిని మాత్రం నిత్యం పోరుగు దేశంపైనే పెట్టడం విడ్డూరమని విమర్శించింది. కాశ్మీర్ లో అల్లర్లను సృష్టించేందుకు తమ ఉగ్రవాదులను నిత్యం చోరబాట్లకు ప్రేరేపిస్తున్న పాక్.. అందుకోసం వందల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ.. మాట మాట్లాడితే మానవ హక్కుల గురించి ప్రసంగాలు చేయడం విచిత్రంగా వుందని.. తమ దేశంలో లేని ప్రజాస్వామ్య విలువల గురించి పాక్ గగ్గోలు పెడితే.. వినే తిరిక ప్రపంచానికి లేదని ధ్వజమెత్తింది. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్లో భూభాగమే అని, ఇది పాక్‌ అర్థం చేసుకుని మసులుకోవాలని ఈనం గంభీర్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles