opposition party leaders meet governor narasimhan అది పార్టీ నేతలకు దోచిపెట్టే సర్వే.. రద్దు చేయంచరూ..!

Opposition party leaders meet governor narasimhan to nullify go 39

opposition party leaders, governor ESL Narasimhan, congress, BJP, TDP, CPI, CPM, batti vikramarka, chinatala ramachandra reddy, L.Ramana, chada venkat reddy, land survey, rythu samanvaya samithi, TRS government, party men, telangana

opposition party leaders of telangana meet governor ESL Narasimhan, asked to interfere in land survey by TRS government by party men.

అది పార్టీ నేతలకు దోచిపెట్టే సర్వే.. రద్దు చేయించరూ..!

Posted: 09/13/2017 03:58 PM IST
Opposition party leaders meet governor narasimhan to nullify go 39

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 39 వివాదాస్పదంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. ఈ మేరకు తమ పోరు ఉధృతం చేశాయి. రైతు సమన్వయ సమితుల పేరుతో ప్రభుత్వం తమ పార్టీ నేతలకు దోచిపెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని ప్రతిపక్షాలు అరోపించాయి. ఈ మేరకు విపక్ష పార్టీల నేతలందరూ కలసి గవర్నర్ నరసింహన్ ను కలసి.. ఈ సమితులను అడ్డుకోవాల్సిందిగా కోరారు.

గవర్నర్ నరసింహన్ తో భేటీకాగా, ఆయన విపక్ష నేతలకు పలు ప్రశ్నలు వేశారని సమాచారం. భూమి సర్వేలు చేయడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు..? అసైన్డ్ భూములు, పట్టా భూములు ఎవో తెలియడం మంచిదే కదా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక భట్టి విక్రమార్కుకు చెందిన భూమిని చాడా వెంకటరెడ్డి తన పేరున మార్చగలడం ఎలా సాధ్యమని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియను తాము అడ్డుకోవడం లేదని కాగా, పార్టీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నామని విపక్ష నేతలు చెప్పినట్లు సమాచారం.

గవర్నర్ తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ జీవో 39 కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో రైతులకు కానీ, ఇతరాత్ర ఎవరికీ ఉపయోగపడదని అన్నారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క చెప్పారు. జీవో 39 రాజ్యాంగ విరుద్ధమని, రైతుల పేరుతో టీఆర్‌ఎస్ దోపిడీ చేస్తోందని టీడీపీ నేత ఎల్‌.రమణ విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాండ్ మాఫియాను పెంచి పోషించేందుకే 39 జీవోను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎల్‌.రమణ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

సీపీఐ పార్టీ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు సహకారం పేరుతో టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. జీవో 39 రద్దు చేయాలని విపక్షాలన్నీ గవర్నర్‌ను కోరాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం అన్నారు. త్వరలో అన్ని సంఘాలతో కలిసి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని, 15న వ్యవసాయ కమిషనర్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Man kills snake found on commuter train in indonesia

  ITEMVIDEOS: సోషల్ మీడియాలో హీరోగా మారిన యువకుడు.

  Nov 23 | ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అ సామెతను బాగా వంటపట్టించుకున్న యువకుడు ఏకంగా రద్దీ ఉండే ఓ రైల్లో ప్రయాణికుల హాహాకారాల మధ్య తన ధైర్యాన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.... Read more

 • Assam health minister hemanta biswas sharma controversial statement on cancer

  క్యాన్సర్ పై మూడవిశ్వాసాలు ప్రబలేలా మంత్రి వ్యాఖ్యలు

  Nov 23 | ఆయనో ఓ రాష్ట్రానికి మంత్రి.. అమాత్యుని బాధ్యతలు నెరవేస్తున్న ఈయన గారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మరోమారు వాదిస్తున్నారు. ఎంతలా అంటే ప్రజల్లో మూడనమ్మకాలపై మరింత విశ్వాసం పెంచెలా..? తప్పు చేస్తే శిక్ష తప్పదు... Read more

 • Eps ops faction wins back aiadmk s two leaves symbol

  శశికళకు షాక్.. అధికారంలోని ఆ ఇద్దరే ఇక పార్టీకి రెండాకులు..

  Nov 23 | తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలకు.. ప్రస్తుతం స్థబ్దుగా వున్నాయి. అమ్మ తరువాత చిన్నమేనంటూ జనంలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన శశికళ వర్గానికి షాకుల మీద షాకులు... Read more

 • Hyderabad metro rail smart card bookings to begin at raheja mind space

  మెట్రో స్మార్ట్ కార్డు ఇదే.. ఐటీ హాబ్లో తొలి కౌంటర్..

  Nov 23 | హైదరాబాదీయుల స్వప్నం సాకారమవుతున్న వేళ.. మరికొన్ని గంట్లలో మెట్రో రైలులో ప్రారంభానికి సన్నాహాలు సర్వం సిద్దమైన క్రమంలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అంటూ ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం మెట్రో రైలు కూడా ఇందుకు సంబంధించిన... Read more

 • Violence breaks out at sathyabama university after student s suicide

  విద్యార్థిని బలవన్మరణం.. యూనివర్సిటీలో విధ్వంసం

  Nov 23 | చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక... Read more

Today on Telugu Wishesh