మోదీ కొత్త టీం సిద్దం.. కొత్త మంత్రి వర్గంలో ఏపీ నేత? | All Set for Modi Cabinet reshuffle

Modi cabinet reshuffle very soon

National Democratic Alliance India, JD(U) AIADMK, Prime Minister Narendra Modi, Cabinet Reshuffle, China Visit

Narendra Modi Cabinet reshuffle. At least five central ministers quit on Thursday as part of a larger restructuring, which is expected to take place by Sunday and is likely to see the creation of an integrated transport ministry under road and shipping minister Nitin Gadkari, who could be given charge of railways.Suresh Prabhu environment. AIADMK may not join NDA for now

మోదీ కొత్త టీం రెడీ.. రేపో ఎల్లుండో విస్తరణ?

Posted: 09/01/2017 07:06 AM IST
Modi cabinet reshuffle very soon

ప్రధాని నరేంద్ర మోదీ తన కొత్త టీంకు రంగం సిద్ధం చేసుకున్నారు. చైనా పర్యటనకు ముందే ఉండబోతుందన్న ఊహాగానాలకు తెరదించేలా శని లేదా ఆదివారాల్లో కేబినెట్‌ పునర్వవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎన్డీయేలోకి ఇటీవల వచ్చి చేరిన జేడీయూకు కేబినెట్‌లో స్థానం కల్పించనుండగా, అన్నాడీఎంకే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ప్రస్తుత మంత్రుల్లో 8 మందిపై కత్తివేలాడుతుండగా, మరో 8 మంది శాఖలు మారే అవకాశం ఉంది.

ఇప్పటికే మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్, ఉమాభారతి, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేయగా వీరిలో రాజీవ్ రూడీ, సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. ఉమాభారతి అనారోగ్య కారణాలతో రాజీనామా సమర్పించారు. ఇక పదవి కోల్పోనున్న వారిలో నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తుండగా, సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు శాఖ మారిపోనున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రభుకు పర్యావరణ శాఖ, అలాగే ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు మోస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తిస్థాయిలో అప్పగించి ఆర్థిక శాఖను పీయూష్‌కు అప్పగించే యోచనలో ఉన్నారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు కేబినెట్‌లో చోటు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

దత్తన్నకు ఉద్వాసన..


కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలకనున్నారు. దత్తన్నను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీలో ఈ విషయాన్ని దత్తాత్రేయకు అమిత్ షా స్పష్టం చేశారు. భేటీ అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, తనకు గవర్నర్ పదవిని ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలువురికి మంత్రివర్గంలో కొత్తగా స్థానం లభించనుంది. మరోవైపు, అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Vabinet Reshuffle  

Other Articles