అమెరికా తుఫాన్ లో ఎన్నారైలు.. హుస్టన్ నగరంలో ఆకలి కేకలు. సాయానికి విద్యార్థులు రెడీ | Huston floods Indian mission helps NRI for Food

Houston floods nri suffers

America Harvey Hurricane, Non Residents India, Huston Floods, Amrica Weather, USA Help Line NRI

America Harvey Hurricane floods. Indian mission in Houston shares helpline numbers. With some 200 Indian students of the University of Houston affected by floods in the wake of tropical storm Harvey, the Indian mission in the Texas city on Tuesday shared helpline numbers for worried families and relatives back in India.

అమెరికాలో ప్రవాస భారతీయుల ఆకలి కేకలు

Posted: 09/01/2017 07:14 AM IST
Houston floods nri suffers

అమెరికాలోని హూస్టన్ ‘హార్వే’ తుఫాను ధాటికి విలవిల్లాడుతోంది. హరికేన్‌లో చిక్కుకుని తెలుగు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువాళ్లే ఎక్కువ కావటం విశేషం. మరోవైపు వందలాది ఇళ్లు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. హూస్టన్ నగరం అతలాకుతలమవడంతో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది.

నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది.

NRI Huston Floods

మరో పక్క ఓ భారతీయ విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా అమెరికాలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాలన్ పెట్రోలు ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది. 

ఖాళీ చేయండి.. చచ్చిపోతారు...

తూర్పు టెక్సాస్ వాసులకు హర్వే హరికేన్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు’’ అంటూ అనౌన్స్ మెంట్లు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా తూర్పు టెక్సస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడి, అతలాకుతలం చేసింది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ఊహించుకోవచ్చు.

ప్రస్తుతం హూస్టన్‌ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తున్నాయి. టేలర్‌ కౌంటీలోని నిషెస్‌, స్టీన్‌ హేగెన్‌ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అలా కాకుండా అక్కడే ఉంటే బతికే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కేవలం టెక్సాస్ లోనే 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాధమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 48,700 ఇల్లు ధ్వంసమయ్యాయని, వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Harvey Hurricane  Huston Floods  

Other Articles