Trump's daughter Ivanka to visit Hyderabad హైదరాబద్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె

Accepting pm modi s invitation donald trump s daughter ivanka to visit india

Ivanka Trump, United States of America, Narendra Modi, Global Entrepreneurship Summit, Hyderabad, Donald Trump, Ivanka trump India tour

US President Donald Trump's daughter Ivanka will visit India to take part in Global Entrepreneurship Summit (GES), which is scheduled to be held in Hyderabad in late November.

హైదరాబద్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్

Posted: 08/08/2017 04:54 PM IST
Accepting pm modi s invitation donald trump s daughter ivanka to visit india

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను దేశ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ తన ఇటీవల అమెరికా పర్యటనలో అహ్వానించిన విషయం తెలిసిందే. తప్పక వస్తానని చెప్పిన ట్రంప్ తన పర్యటన తేదీని మాత్రం ఇప్పటి వరకు ఖారారు చేయలేదు. కాగా, ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ మాత్రం మరో మూడు నెలల్లో దేశంలో పర్యటించనున్నారు. ఎక్కడికి వస్తున్నారని అత్రుతగా అడుతున్నారు కాదూ.. మన హైదరాబాద్ నగరంలోనే అమె పర్యటించనున్నారు. నవంబర్ 28న జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇవాంకా రానున్నారు.

ఈ సమ్మిట్ లో పాల్గోనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఇవాంకా ట్రంప్ ను ఆహ్వానించడంతో.. అంగీకరించిన ఆమె ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సదస్సుకు మోడీ కూడా హజరుకానున్నారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. ఎనమిదేళ్లుగా ప్రతీ ఏడాదికో పర్యాయం ఈ సదస్సుకు పలు దేశాలు అతిథ్యమివ్వగా క్రమం తప్పకుండా కొనసాగుతూ.. ఈ ఏడాది ఎనమిదవ వార్షికోత్సవ సదస్సును మన దేశంలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ సదస్సుకు ఇవాంక ట్రంప్ రావడం కొత్త అకర్షణగా నిలుస్తుంది.

తొలిసారిగా గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న భారత్ లో అన్ని అనుకూలతలు వున్న హైదరాబాద్ మహానగరాన్నే ఇందుకు వేదికగా ఎంపిక చేయడం ముదావహం. అయితే ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న నీతి అయోగ్ తీసుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది. ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles