Ousted Police Dog got New Luxurious Job

Too friendly dog got double promotion

Queensland Dog, Queensland Gavel, German Shepherd, Gavel Dog, German Shepherd pup, Queensland Governor, Dog Double Promotions, Police Dog Sacked, Too friendly Police Dog, Welcomes Dog, Police Dog Promotion, Queensland Favorite Dog

Too friendly German Shepherd pup dismissed from duties by Queensland police force. Now Gavel has a dream job. welcomes guests at Queensland Governor's mansion.

ఉద్యోగం ఊస్టింగ్.. ఆపై డబుల్ ప్రమోషన్

Posted: 06/12/2017 02:59 PM IST
Too friendly dog got double promotion

అవమానాలు ఎవరి జీవితంలో శాశ్వతం కాదు. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. గెంటితే గేటు కూడా డబుల్ స్పీడ్ తో వెనక్కి వస్తుంది. కానీ, గావెల్ అనే శునకం పరిస్థితి అది అలా ఇలా జరగలేదు. ఎందుకు పనికి రాదంటూ పక్కకు పడేయగా, అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుని ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తోంది. ఆసక్తికరమైన ఈ కథనం వివరాల్లోకి వెళ్లితే...

క్వీన్ లాండ్ లో జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన గావెల్‌ అనే డాగీకి పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. బాంబులను గుర్తించే బ్యాచ్ లో దాని శిక్ష‌ణ‌ పూర్తయ్యింది. కానీ, తర్వాత టెస్ట్ లలో అది ఫేలయ్యింది. చెప్పిన పని కాకుండా దానికి ఇష్టం వ‌చ్చినట్లు ప్ర‌వ‌ర్తించేది. పైగా కొత్తవారు క‌నిపిస్తే వారి ద‌గ్గ‌ర‌కు క్లోజ్ గా మూవ్ అయ్యేది. దీంతో దాని లక్షణాలతో జాగిలంగా పనికిరాదని, అతి మంచితో భవిష్యత్తులో ఎప్పటికైనా డేంజరే నని భావించిన అధికారులు దాన్ని బయటకు పంపించేశారు.

ఈ విషయం తెలుసుకున్న క్వీన్‌లాండ్‌ గవర్నర్‌ అధికారిక నివాసం గావెల్ ను అప్పగించాలని పోలీసులను కోరింది. స్వయంగా గవర్నరే ఈ విషయంలో విజ్నప్తి చేయటంతో గావెల్ ను అప్పగించారు అధికారులు. దానికి ఆపై అక్కడ ఓ ఉద్యోగం కూడా లభించింది. గవర్నర్ దంపతులతో చనువుగా ఉంటూ వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ, పైగా లగ్జరీ బంగళాలో మాంచి జీవితాన్ని గడుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gavel  Queensland Dog  Governor Mansion  

Other Articles