petrol bunks to remian shut on sundays వాహనం అగిందా.. ఛల్ భోలో గోవిందా..!

Petrol bunks to remian shut on sundays from tomorrow

petrol bunks to remian shut, petrol bunks shut on sundays, petrol bunks closed on sundays, petrol dealers agitation, petrol bunks one shift operations, Oil ministry, dealerships demands, distribution demands, Pradhan Mantri Ujjwala Yojana, petroleum, Natural gas, LPG

Petrol pumps will remain shut on all Sundays starting from May 14 and from May 15, these filling stations plan to operate in shifts between 9am and 6am.

వాహనం అగిందా.. ఛల్ భోలో గోవిందా..!

Posted: 05/13/2017 03:44 PM IST
Petrol bunks to remian shut on sundays from tomorrow

మీ బైక్ లో పెట్రోల్ వుందా..? మీ కారులో డీజిల్ వుందా..? లేకపోతే తక్షణం వెళ్లి ఫుల్ చేసుకోండి. రేపు ఎలాగో అదివారం.. చిన్నపాటి ట్రిప్ ప్లాన్ చేశాం.. మార్గమద్యంలో పెట్రోల్ బంకులో కొట్టించేసుకుంటాంలే.. అని అంటే ఇక కుదరదు. ఇవాళ సాయంత్రం ఆరు గంటల లోపు రేపటికి కూడా సరిపడా పెట్రోల్ కొట్టించుకొండి. సాధ్యమైతే పెట్రలో్ ట్యాంక్ సగం ట్యాంకైనా ఫుల్ చేసుకోండి. ఎందుకంటే.. రేపట్నుంచి పెట్రోల్ బంకుల యాజమాన్యాల అంచెలవారి ఉద్యమంలో భాగంగా కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి.

పెట్రోల్ బంకు యాజమాన్యాలు కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ.. అంచెలవారీగా అందోళనలను ఇవాళ సాయంత్రం నుంచే ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను అంగీకరించాలని లేని పక్షంలో తాము అంచెలవారీ అందోళనబాట పడతామని ఇప్పటికే ప్రకటించాయి. గత రెండు మూడు మాసాలుగా తాము అందోళన బాట పడతామని చెప్పినా కేంద్ర ఇంధన శాఖ వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించలేదు. వారికి లభిస్తున్న లాభం వాటాను పెంచాలని ఇక బంకు డీలర్లు అందోళన చేప్టటనున్నారు.

దీంతో ఇక ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవు. అధివారాలు పెట్రోల్ బంకులు సెలవును పాటించనున్నాయి. మరోలా చెప్పాలంటే అదివారాలు ఇంధన కంపెనీల నుంచి డీలర్లు ఇంధనాన్ని కొనుగోలు చేయబోరు. అయితే శనివారం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే పెట్రోల్ బంకులు పనిచేయనున్నాయి. సోమవారం నుంచి కూడా పెట్రోల్ బంకులు సాయంకాలం వరకు మాత్రమే అంటే కేవలం ఒక్క షిఫ్టు విధానాన్ని మాత్రమే అమలు చేయనున్నాయి. ఈ మేరకు పెట్రోల్ బంకుల్లో నోటీసులను కూడా అంటించారు. ఇంకెందుకు అలస్యం పెట్రోల్ బంకులను పరుగులు తీయండి మరీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oil ministry  petroleum  petrol bunks  sundays  dealers  agitation  

Other Articles