Ahinda communities will never support BJP: Siddaramaiah పీడపాలన రోజులను ప్రజలు మర్చిపోలేరు: సీఎం వ్యంగోక్తి

Siddaramaiah lashes out on nirmala sitharaman goonda raj comments

siddaramaiah on nirmala sitharaman, siddaramaiah on yeddurappa, siddaramaiah on bjp tour, siddaramaiah on bjp corruption, CM siddaramaiah, Nirmala SItharaman, law and order, yeddurappa, congress, BJP, karnataka, politics

Regretting the statement of Nirmala SItharaman that Karnataka has become a ‘goonda raj’, karnatka CM siddaramaiah said, she should study the ground realities before talking.

‘యడ్డీ’ పాలన రోజులను ప్రజలు మర్చిపోలేరు:సీఎం వ్యంగోక్తి

Posted: 05/09/2017 10:37 AM IST
Siddaramaiah lashes out on nirmala sitharaman goonda raj comments

బీజేపిలోనే అవినీతిపరులు వున్నారంటూ.. ఆ పార్టీ మొత్తం అవినీతిమయమైందని అరోపణలు సంధించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ పార్టీపై దాడిని కూడా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపి కర్ణటాక అధ్యక్షుడు యడ్యూరప్పలు హైకమాండ్ కు ముడుపులు ముట్టజెప్పామన్న వీడియో క్లిపులపై ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మరో బీహార్ లా తయారవుతుందంటూ కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ చేసని వ్యాఖ్యలపై కూడా ఆయన ధీటుగా బదులిచ్చారు.

కర్ణాటక రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా వుందని, ఇక్కడి నుంచే ఎంపీగా ఎంపికైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ఎలా వుందో ముందుగా అవగాహన పెంచుకోవాలని ఆ తరువాత అమె విమర్శలు చేయాలని ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో చట్టం కూడా పకడ్బంధీగా అమలు చేస్తుండడం వల్లే అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఇంకా అనేక సంస్థలు అసక్తిని కూడా కనబరుస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కేంద్రమంత్రి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అప్నారు. ఇక యడ్యూరప్ప రాష్ట్ర పర్యటనపై కూడా ఆయన తనదైన శైలిలో చమత్కరించారు. రాష్ట్ర ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనలో అనుభవించిన కష్టనష్టాలను అంత సులువుగా మర్చిపోలేరని వ్యంగోక్తి విసిరారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అవినీతిలో కూరుకుని జైళ్లకు వెళ్లిన వ్యక్తిని ప్రజలు ఎలా అదరిస్తారని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటలో బీజేపి ఐదేళ్ల కాలం అధికారంలో వుండగా, ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో కూడా అమె ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. అదే సమయంలో కరువు నిధులపై కేంద్రం విడుదల చేసిన పరిహార నిధులపై శ్వేతపత్రాన్ని చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వర్షాల కొరతతో ఖరీఫ్ సీజన్ లో చోటుచేసుకున్న పంట నష్టాలతో పాటు రబీ సీజన్ పంట నష్టాలకు కలపి 8వేల కోట్ల రూపాయలను కేంద్ర విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరుతామన్నారు. ఇప్పటివరకు బీజేపి ప్రభుత్వం కేవలం 1670 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్న బీజేపి నేతలు నిజంగా రాష్ట్రాభివృద్దిని కాంక్షించే వారైతే.. రాష్ట్రానికి కరువు పరిహార నిధులను విడుదల చేయాంచాలని, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిని తీసుకురావాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM siddaramaiah  Nirmala SItharaman  law and order  yeddurappa  congress  BJP  karnataka  politics  

Other Articles