crude oil price plunged to five-month low తగ్గనున్న ఇంధన ధరలు.. దిగివస్తున్న క్రూడ్ అయిల్ రేటు

Oil producers mulling options after brent crude price drop

risk, Open Interest, Opec, Market, CRUDEOIL petroleum products, petrol, diesel, oil prices, international market, barrel crude oil

West Texas Intermediate crude broke through its 200-day moving average last week after a battle had raged between bulls and bears.

ఇంధన ధరలు తగ్గుముఖం.. దిగివస్తున్న క్రూడ్ అయిల్ రేటు..

Posted: 05/07/2017 12:55 PM IST
Oil producers mulling options after brent crude price drop

ఇంధన ధరలు మరింతగా దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ అయిల్ ధరలు తిరోగమనంలో పయనిస్తున్న క్రమంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే ముడిచమురు ధరలు, ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో చూపుతున్న పట్టుదల కారణంగా తిరోగమనంలో పయనిస్తున్నాయి. కాగా ప్రపంచ మార్కెట్ లో ధోరణితో పాటు ఒపెక్ పట్టువీడని పక్షంలో సమీప భవిష్యత్తులో మరింతగా దిగిరానున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫ్యూచర్స్ కాంట్రాక్టులో జూలైతో పాటుగా ఆగస్టు మాసంలో కూడా ధర 39 డాలర్ల దిగువకు పడిపోగా, 14 వేల లాట్ లు ట్రేడ్ అయ్యాయి.  అయితే సుమారు 7 మిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్స్ చేతులు మారడంతో క్రూడాయిల్ ధరలు మరోసారి క్షీణిస్తాయని ఇదే బలమైన కారణంగా భావిస్తున్నారు. దీంతో చమురు మార్కెట్ కు ప్రతికూలాంశాలే అధికంగా కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణుడు, ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 'ఆప్షన్ సెల్లర్స్ డాట్ కామ్' వ్యవస్థాపకుడు జేమ్స్ కార్డియర్ వ్యాఖ్యానించారు.

గడచిన మూడు వారాల్లో 13 శాతం మేరకు ధరలు పతనమైనాయని గుర్తు చేసిన ఆయన, తదుపరి నెల రోజుల వ్యవధిలో మరింతగా ధరలు పడిపోతాయని అంచనా వేశారు. కాగా, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి పక్షం రోజులకూ ఒకసారి ధరలను సవరిస్తున్న భారత చమురు కంపెనీలు, మరో వారంలో ఇంకోసారి ధరలను తగ్గిస్తూ, ప్రకటించవచ్చని అంచనా. ఆపై క్రూడాయిల్ ధర జూలై లో 39 డాలర్ల దిగువకు వస్తే దేశంలో పెట్రోలు, డీజెల్ ధరలు మరింతగా తగ్గుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles