foreign tourist enters Hampi temple with liquor మద్యం సీసాలతో పవిత్ర అలయంలోకి పర్యాటకులు

Foreign tourist enters hampi temple with liquor triggers huge protest

foreign tourist, foreign tourist with liquor, foreign tourist liquor hampi temple, foreigner ruckus in hampi temple, UNESCO, liquor inside Virupaksha Temple, liquor inside Temple, liquor inside Hampi temple, Archaeological Society of India news, latest news

A foreign tourist triggered a ruck-us at Hampi after carrying and consuming liquor inside Virupaksha Temple premises- a prohibited area.

అలయంలోకి మద్యం సీసాలతో వచ్చి రచ్చ చేసిన పర్యాటకులు

Posted: 04/21/2017 04:54 PM IST
Foreign tourist enters hampi temple with liquor triggers huge protest

విదేశీయులు కూడా హైందవ మతం అన్నా.. హైందవ ధర్మం అన్నా అమితాసక్తిని చూపుతారు. కఠినమైన హైందవ అచార వ్యవహారాలను తెలుసుకుంటారు. హైందవులు పరమపవిత్రంగా భావించే ఆలయాలను సందర్శిస్తుంటారు. వారి దేశాల నుంచి భారత దేశానికి వచ్చి మరీ చారిత్రాత్మమైన ఆలయాలను పర్యటిస్తారు. ఇంతవరకు బాగానే వున్నా తమకు ఎలాంటి కట్టుబాట్లు లేవని భావించే విదేశీ పర్యటకలు.. మన దేశానికి వచ్చే సరికి మన కట్టుబాట్లను అచారాలను వారు పాటించాల్సిందే. మరీ ముఖ్యంగా అలయాల్లోకి వెళ్లేప్పుడు పాదరక్షలు విడిచివెళ్లడం, స్నానాదులు చేసిన తరువాతే అలయాల ప్రవేశం చేయడంలాంటివి చేయరాదు. అయితే వీటిని కూడా వీదేశీ పర్యాటకులు పాటిస్తారు.

అయితే తమకు అచారవ్యవహారాలు లేవని, తాను ఎలాగైనా ఆలయంలోకి వస్తానని అందుకు అడ్డుకోవడం ఏమిటంటూ ఓ విదేశీ పర్యాటకుడు వాదనకు దిగి.. చేతిలో మధ్యం బాటిల్ తో నేరుగా అలయంలోనికి వచ్చాడు. ఇది గమనించిన ఆలయసిబ్బంది అతడ్ని అడుకుని సదరు విదేశీ జంటను ఆలయం బయటకు పంపారు. కాగా, మరోమారు కూడా అలానే ఆలయ ఆచారాలను అపచారం చేస్తూ ధర్మాలకు భిన్నంగా నడుచుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే హంపీలోని విరూపాక్ష ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ టూరిస్టు హాలండ్‌ ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, ఆవరణంలో మద్యపానంపై నిషేధం ఉంది. అలాంటిది ఓ విదేశీ పర్యాటకుడు మాత్రం ఏకంగా ఆలయం లోపలికి మద్యం బాటిల్ తో అడుగుపెట్టాడు. తొలుత మేం చెప్పగానే అతడు తన పార్టనర్‌తో కలిసి బయటకు వెళ్లి.. అమెను బయటే వుంచిన పర్యాటకుడు, ఐదు నిమిషాల తర్వాత ఒక్కడు మాత్రమే తిరిగి ఆలయంలోకి వచ్చాడు.

మద్యం బాటిల్ ను బయటపెట్టి వచ్చుంటే.. దూరం నుంచి వచ్చాడు కదా అని అవరణలో తిరిగే అవకాశన్ని అలయాధికారులు ఇచ్చేవారేమో కానీ.. మద్యం సీసాను దుస్తుల వెనుక దాచుకొని రావడం.. ఆలయ ధర్మకర్తలు, కార్యకర్తలకు కోపాన్ని తెప్పించింది. దీంతో గట్టి వార్నింగ్‌ ఇచ్చి వెనక్కి పంపించాం’ అని సేవ్‌ హంపీ ఉద్యమకారుడు రచ్చయ్య తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని, ఆ టూరిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ టూరిస్టుకోసం ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : foreign tourist  liquor  hampi temple  Virupaksha Temple  huge protests  Temple commitee  

Other Articles