హాయిగా నిద్రపోవడమే జాబ్ అయితే.. లక్షల్లో జీతం వుంటే..! Get paid Rs 11.2 Lakh for only 'sleeping in bed'

Scientists offering usd 17 000 for sleeping in bed

Exciting job offer, scientists offering job, sleeping job, France Institute for Space Medicine and Physiology, scientists jobs, jobs in science, science news

There is a job offer which pays you Rs 11.2 Lakh for spending two months or 60 days lying in bed. The offer comes from the Researchers at France’s Institute for Space Medicine and Physiology.

పడుకుంటే పదకొండు లక్షలు.. వావ్..!

Posted: 04/05/2017 08:35 PM IST
Scientists offering usd 17 000 for sleeping in bed

ఉదయాన్నే లేటుగా నిద్ర లేస్తే.. ఏమండీ ఆఫీసుకు వెళ్లరా..? అంటూ అదే సుప్రభాతంగా మీ అర్థాంగి నిద్రలేపుతున్నారా..? అప్పుడే అనిపిస్తుంది కదూ.. ఓరి దేవుడా నా రాత ఇలా ఎందుకు రాసావు.. ఏదో ప్రభుత్వ ఉద్యోగానైనా ఇచ్చివుంటే.. కనీసం మద్యాహ్నానికి ముందు వెనుక కునుకు తీసే అదృష్టమైనా వుండేదీ అని..? ఇక మరికొందరు మరీ అత్యాశపరులు వుంటారు. వీళ్లు తమకు నిద్రపోయే ఉద్యోగన్నే ఎందుకని దేవుడు తమకు కల్పించకూడదు అని అడుగుతూ వుంటారు.

సరిగ్గా అ రెండో కోవాకు చెదిన వారి కోసమే ఓ ఉద్యోగం వుంది. ఈ ఉద్యోగంలో మీరు చేయాల్సిందల్లా హాయిగా నిద్రపోవడమే. తినడం, పడుకోవడం.. ఇదే ఉద్యోగం. బాగానే వుందికానీ ఇలా చేస్తే మాత్రం ఎవరు జీతం ఇస్తారు అనుకుంటున్నారా.. ఇస్తారట. సరేలే వచ్చే జీతంతోనే ఇల్లు నడవడం కష్టంగా వుంది.. ఇలాంటి ఉద్యోగాలు చేస్తే వారిచ్చే అత్తెసరు జీతాలతో ఇల్లు గడవద్దు అంటారా..? అయితే అక్కడే నిద్రమత్తులో కాలేశారు. లక్షల రూపాయల జీతం ఇస్తారట.

ఏంటేంటీ..? అర్హతలేమిటీ అంటూ అడుగుతున్నారా.., మీరు పురుషులు, పొగతాగడం అలవాటు లేని వారు, బాడీ మాస్ ఇండెక్స్ 22-27 మధ్య ఉంటే చాలు. అవన్నీ వున్నాయని భావిస్తున్నారా...? అయితే ఇకనేం మీరు కూడా ఈ ఉద్యోగానికి ప్రయత్నించండి.... హాయిగా నిద్రపోవడం. అవును! ఈ ఉద్యోగం కోసం అర్హులైన వారికోసం వెతుకులాట కూడా ప్రారంభమైంది. ఫ్రాన్సిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు. ఉద్యోగం పొందినవారు సరిగ్గా అరవై రోజుల పాటు తినడం పడుకోవడం. ఇక కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానాదులు అచరించడం వంటివి చేస్తే సరిపోతుంది. ఇక వీరి అందుకుగాను ఏకంగా 16 వేల యూరోలు (దాదాపు 11.2 లక్షల రూపాయలు) చెల్లించనున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో పునరుత్పత్తి‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో భాగంగా రెండు నెలలపాటు నిద్రించే వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. మూడు దశల్లో వీరిపై ప్రయోగాలు చేస్తారట. మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి. 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు పురుషులు అర్హులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles