జగన్ సీఎం అయ్యే ఒకే ఒక్క రూట్ అదేనంట.. మరి పవన్ ఫ్యూఛర్? | Jagan will become CM after merge party with BJP.

Diwakar reddy again slams ys jagan

JC Diwakar Reddy, JC Jagan, Diwakar Jagan, YS Jaganmohan Reddy BJP, BJP YS Jagan, BJP JC YS, Diwakar Reddy Pawan Kalyan, JC Suggest Pawan Kalyan, JC BJP-TDP Alliance

Ananthapur MP JC Diwakar Reddy again slams YS Jagan. Says Jagan will merge his party after BJP promise him to make CM. Suggest Pawan to expand his Janasena otherwise no future.

బీజేపీలో వీలినానికి వైసీపీ కండిషన్!

Posted: 03/23/2017 02:55 PM IST
Diwakar reddy again slams ys jagan

అధికారం వచ్చిన తొలినాళ్లలో జగన్ పై సాఫ్ట్ వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాను రాను వాటి ఘాటు పెంచుతూ వస్తున్నాడు. జగన్ అసలు రెడ్డియే కాదంటూ మొదలుపెట్టి తర్వాత ఏకంగా బూతు పురాణమే అందుకున్నాడు. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు కూడా. అయినా తన నోటికి మాత్రం జేసీ పని చెబుతూనే వస్తున్నాడు.

తాజాగా మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి జగన్ తోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైన కామెంట్లు చేశాడు. కాబోయే ముఖ్యమంత్రినంటూ పదే పదే డప్పు కొట్టకునే జగన్ కి సీఎం పదవి ఇస్తామన్న హామీ ఇస్తే చాలూ బీజేపీ వైఎస్సార్పీపీని విలీనం చేసేస్తాడని తేల్చేశాడు. తండ్రి చనిపోయాక ఆ సింపథీ పెట్టిన జగన్ కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడన్న దాంట్లో అసలు అనుమానమే లేదని జేసీ అంటున్నాడు.

చంద్రబాబును వదులుకునే పనిని బీజేపీ ఎలాగూ చేయదు గనుక ఆ వీలినం, జగన్ సీఎం అవ్వటం రెండూ జరగవని చెప్పాడు. ఇక జనసేన పార్టీ పరిధి పరిమితంగా ఉందన్న జేసీ, దాని నుంచి బయటపడితే గానీ ఆ పార్టీకి భవిష్యత్ ఉండబోదని సలహా ఇచ్చాడు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాడని, అది ఎలాంటి ప్రయోజనం ఇవ్వదంటూ జేసీ మరో కామెంట్ చేయటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  YS Jaganmohan Reddy  Janasena Pawan kalyan  

Other Articles