విద్యార్థికి టీచరమ్మ ప్రేమపాఠాలు.. Parents say son is living in with his teacher

Teacher elopes with intermediate student

PUC student, teacher, parents, teacher student romance, teacher elopes with student, student living in with teacher, teacher living in with student, Kalaburagi, Chowk, Ashok Nagar, karnataka

A first PUC student in Kalaburagi has been missing for three months and his parents believe the boy has eloped with his 40-year-old teacher.

విద్యార్థితో టీచరమ్మ ప్రేమాయణం.. సహజీవనం..

Posted: 03/02/2017 11:45 AM IST
Teacher elopes with intermediate student

గురువును అరాధించడంతోపాటు.. తల్లిదండ్రులు, దైవం తరవాత స్తానం గురువులకే కల్పిస్తుంది మన భారతీయ సంస్కృతి. విదేశాలలో కూడా వారికి అలాంటి స్థానమే వున్నా.. పలు దేశాలలో మాత్రం టీచర్లు మరీ దారుణంగా ప్రవర్తించి.. విద్యార్థులతో శృంగారంలో పాల్గోన్న ఘటనలు వెలుగుచూశాయి. ఆ మధ్య పోర్న్ చిత్రాలలో నటించే మహిళలు ఉదయం పూట మాత్రం ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ కూడా పట్టుబడ్డారు. ఇక మరో దేశంలో మాత్రం ఏకంగా అన్నాదమ్ములిద్దరికీ ఓ టీచర్ బర్త్ డే గిప్టుగా శృంగారంలో పాల్గోనే అవకాశాన్ని కల్పించింది.

ఈ ఘటనలు విన్నప్పుడు మాత్రం మన గురువులు మాత్రం ఇలాంటి పాడుపనులకు మినహాయింపు అనుకున్నాం. మన టీచర్లకు సభ్యతా, సంస్కారం తెలుసు.. అందుకనే వారు విద్యార్థులను కేవలం పిల్లలుగానే పరిగణిస్తారు. మరీ మాట్లాడితే.. మీకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకండీ అంటూ మందలిస్తారు కూడా. భావిభారతపౌరులను తీర్చదిద్దడంలో మన దేశ టీచర్లకు వున్న అకుంఠిత దీక్ష, పట్టుదల, నేర్పరితనం చూసి విదేశాలు కూడా మనవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయనడంలో సందేహమే లేదు.

అయితే కర్ణాటకలోని ఓ టీచరు మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా వ్వవహరించారు. ఏకంగా పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకున్న టీచరులానే విద్యార్థికి ప్రేమపాఠాలను నేర్పించారు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చిన విద్యార్థితో ప్రమాయణం నడిపారు. అంతేకాదు.. దాని మత్తు నశాలనికి ఎక్కిందో ఏమో కానీ ఏకంగా 17 ఏళ్ల శిష్యుడితో కలిసి పరారైంది. ఈ సంఘటన కర్ణాటకలోని కలబుర్గిలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ట్యూషన్ కోసం ప్రతిరోజు ఓ టీచర్‌ వద్దకు వెళ్లేవాడు. ఇలా రెండేళ్ళుగా ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థితో ఆ టీచర్‌ కొంత కాలంగా ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్ధి పదో తరగతి పూర్తి చేయడంతోనే అతనిపై మనస్సుపడ్డ టీచరమ్మ.. ప్రేమాయణం నుంచి శృంగారం కూడా నడపడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులతో ఏలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా విద్యార్థితో కలసి పరారైందని సమాచారం.

ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. తమ బిడ్డకు టీచర్ మత్తు ఇచ్చి తన కార్యకలాపాలను కొనసాగించు కున్నారని అరోపించారు. తమ బిడ్డకు ఇష్టం లేకున్నా వాడిపై నేరాలు మోపుతానని బెదించి లొంగదీసుకుని సహజీవనం చేస్తుందని అరోపించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు కూడా పిర్యాదు చేశామన్నారు. కాగా, టీచరమ్మకు ఇప్పటికే పెళ్లైందని, ఆమెకు 10,12 ఏళ్ల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త నుంచి విడాకులు పొందిన టీచర్‌ ఒంటరిగానే ఉండేవారని స్థానికులు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PUC student  teacher  parents  Kalaburagi  Chowk  Ashok Nagar  karnataka  

Other Articles