వ్యూహం మార్చిన పళనిస్వామి.. మీడియాతో మాట్లాడకుండానే.. Palanisamy meets governor, claims to have support of 126 AIADMK MLAs

Palanisamy meets governor claims to have support of 126 aiadmk mlas

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, palanisamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

After he was elected the new legislature party chief, Edappadi Palanisamy met Tamil Nadu Governor Vidyasagar Rao. According to some reports, he claimed to have the support of 126 AIADMK MLAs.

వ్యూహం మార్చిన పళనిస్వామి.. మీడియాతో మాట్లాడకుండానే..

Posted: 02/14/2017 06:27 PM IST
Palanisamy meets governor claims to have support of 126 aiadmk mlas

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా నిర్థరణ కావడంతో అన్నాడీఎంకే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మంత్రి పళనిస్వామి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పిలుపు మేరకు ఆయనతో భేటీ అయ్యారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఉదయం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో వ్యూహం మార్చిన శశికళ.. తనకు అత్యంత విదేయుడు, పన్నీరు సెల్లానికి బద్ద శత్రువైన పళనిస్వామిని అన్నాడీఎంకే పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు ఉదయమే గవర్నర్ కు పళనిస్వామిని ఎంపిక విషయాన్ని గవర్నర్ కు తెలిపిన అన్నాడీఎంకే అయనను కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ కోరింది. దీంతో ఇవాళ సాయంత్రం అపాయింట్ మెంట్ ఇచ్చన గవర్నర్ ను గోల్డన్ బే రిసార్ట్స్ నుంచి తన సహచరుడు సెంగోట్టియన్ తో పాటుగా వెళ్లి కలిశారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను, వారి సంతకాలతో కూడిన లేఖను రాష్ట్ర గవర్నర్ కు అందజేజశారు. గవర్నర్ తో సుమారు అరగంట పాటు సమావేశం సాగిన తరువాత పళనిస్వామి బృందం మీడియాతో మాట్లాడకుండానే రిసార్టుకు వెళ్లింది.

అయితే అంతకుముందే తన వర్గంలో వున్న 117 మంది ఎమ్మెల్యేలు మద్దతుతో పాటుగా మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు వుందని పళనిస్వామి ఇప్పటికే వెల్లడించారు. తనకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్న్ అనుమతి ఇస్తే.. రానున్న అసెంబ్లీ సమావేశాలలో తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. మొత్తంగా తనకు మద్దతునిచ్చే వారంతా జయలలిత బలపర్చి.. అమ్మ టిక్కెట్టు ఇస్తేనే గెలిచిన అభ్యర్థులని, అంతేకాని అమ్మకు వ్యతిరేకంగా వున్న పార్టీ అభ్యర్థులు ఎవరి మద్దతు తాను పోందడం లేదని చెప్పారు.

అయితే కొద్దిసేపట్లో అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా గవర్నర్ తో భేటి కానున్నారు. అయితే తనకు ఇప్పటికే సుమారుగా 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, కాగా పూర్తిగా తాను బలాన్ని నిరూపించుకునేందుకు మరింత సమయం కావాలని పన్నీరుసెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావును కోరున్నారని సమాచారం. ఆ తరువాత గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది. కాగా తన నిర్ణయాన్ని ఇరు వర్గాలకు చెందిన నెతలకు మాత్రమే తెలియజేయనున్నారని,, వారిలో ఎవరో ఒక్కరినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అహ్వానించనున్నారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  palanisamy  sendigottanyan  thambidurai  AIADMK  

Other Articles