భద్రత డొల్లతనం బట్టబయలు.. కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. Ministry of Home Affairs website hacked

Home ministry site not hacked blocked due to repair work says official

Ministry of Home Affairs, website hacked, cyber crime, National Informatics Centre, NSG website, NSG, MHA, Lok Sabha, hacking, Chrome

Days after a report on the lax cyber-security on central and state government websites, the Ministry of Home Affairs site has become the latest victim of cyber crime.

కేంద్ర హోంశాఖకే భద్రత కరువు.. వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్

Posted: 02/12/2017 01:32 PM IST
Home ministry site not hacked blocked due to repair work says official

కేంద్ర హోంమంత్రిత్వ శాఖకే భద్రత కరువైంది. ఆ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. దీంతో భద్రతా డొల్లతనం మరోమారు బట్టబయలైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమ్యారు. వెంటనే విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందానికి తెలియపర్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐసీ బృందం అధికారులు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది.
 
గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ మానసపుత్రికగా చెప్పుకునే క్యాష్ లెస్ ఎకానమీ వైపు ప్రస్తుతం భారతీయులు కూడా అమితాసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ministry of Home Affairs  website hacked  cyber crime  National Informatics Centre  

Other Articles