బంగ్లా టెస్టులో అశ్విన్ మరో రికార్డు.. Ashwin - the fastest to 250 Test wickets

Ashwin breaks lillee s record to fastest 250 wickets

Ravichandran Ashwin, india, bangladesh, dennis lillee, india vs bangladesh, one-off test, cricket, sport

Ravichandran Ashwin snared Shakib Al Hasan (82) on Day 3 and Mushfiqur Rahim (127) on Day 4 to break the record set by Australian fast bowling legend Dennis Lillee on February 7, 1981.

బంగ్లా టెస్టులో అశ్విన్ మరో రికార్డు..

Posted: 02/12/2017 12:24 PM IST
Ashwin breaks lillee s record to fastest 250 wickets

టీమిండియా స్పిన్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో అత్యంత వేగంగా 250 టెస్టు వికెట్లను సాధించిన ఘనతను అశ్విన్ తాజాగా సాధించాడు. గతంలో 200 వికెట్లను అత్యంత వేగవంతంగా సాధించిన అశ్విన్.. అదే ఫామ్ ను కొనసాగిస్తూ  250 వికెట్ల మార్కును కూడా వేగవంతంగా చేరాడు. బంగ్లాదేశ్ తో ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లను సాధించడం ద్వారా అశ్విన్ 250 వికెట్ల క్లబ్లో చేరాడు.

తన 45వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్.. షకిబుల్ హసన్ ముష్ఫికర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకూ 24 సార్లు ఐదు వికెట్లను సాధించిన అశ్విన్...పదేసి వికెట్లను ఏడుసార్లు తీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 388 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్(127;262బంతుల్లో 16 ఫోర్లు, 2సిక్సర్లు), షకిబుల్ హాసస్(82), మెహిది హసన్ మిరాజ్(51)లు హాఫ్ సెంచరీలు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  india  bangladesh  dennis lillee  india vs bangladesh  one-off test  cricket  sport  

Other Articles