తమిళప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించండీ Sasikala gets impatient, writes to Guv Rao asking him to 'act immediately'

Sasikala gets impatient writes to guv rao asking him to act immediately

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabinet minister, deepa jayakumar, tamil nadu politics

AIADMK chief Sasikala has sought appointment from Governor Vidyasagar Rao with her supporters. She wrote a letter to Rao asking him to act fast towards formation of the new government in Tamil Nadu.

తమిళప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించండీ

Posted: 02/11/2017 05:14 PM IST
Sasikala gets impatient writes to guv rao asking him to act immediately

తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అధికార అన్నాడీఎంకేలోని ఇరువర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ఉత్కంఠకర పోరు సాగుతుంది. ఓ వైపు సీఎం పీఠంపై తేల్చేందుకే అఘమేఘాల మీద వచ్చినట్లు మూడు రోజుల అలస్యంగా చెన్నైకి వచ్చిన గవర్నర్.. ఇప్పటికీ తన మదిలో వున్న నిర్ణయాన్ని స్పష్టం చేయకపోవడంతో ఇదంతా కేంద్రంలోని డైరెక్షన్ ప్రకారమే నడుస్తుందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. అయితే గవర్నర్ వచ్చి కూడా మూడు రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా నాన్చివేత ధోరణి ఎందుకన్న ప్రశ్నలు సైతం తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖ కూడా రాశారు.

అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా తాను ఏకగీవ్రంగా ఎన్నికయ్యానని, ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరిన విషయాన్ని శశికళ లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 5వ తేదీన తమకు ఎమ్మెల్యేల జాబితాతో లేఖను సమర్పించానని, 9వ తేదీన వ్యక్తిగతంగా కలసినపుడు మరోసారి జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరానని రాశారు. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆమోదించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. తమిళనాడు ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని గవర్నర్‌కు శశికళ లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles