నిలకడగా టీమిండియా, అర్థశతకాలతో పుజరా, విజయ్ Vijay-Pujara steady India with respective fifties

India vs bangladesh vijay pujara steady india with respective fifties

India vs Bangladesh, Hyderabad Test, Live Scores, Virat Kohli, Cheteshwar Pujara, Murali vijay, team india, mushfiqur rahim, hyderabad, bangladesh tour of india 2017, cricket, cricket news, sports news, sports

Murali Vijay and Cheteshwar Pujara played cautiously, barring some miscommunication, to steady India on day 1 of the one-off Test against Bangladesh

నిలకడగా టీమిండియా, అర్థశతకాలతో పుజరా, విజయ్

Posted: 02/09/2017 12:36 PM IST
India vs bangladesh vijay pujara steady india with respective fifties

హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు నిలకడగా రాణిస్తున్నారు. క్రీజులో వున్న మురళీ విజయ్, చత్తీశ్వర్ పూజారాలిద్దరూ అర్థశతకాలను నమోదు చేసుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. అదిలోనే అతిథ్య జట్టుకు కె ఎల్ రాహుల్ లభించడంతో మంచి జోష్ మీద కనిపించినా.. ఆ తరువాత వారు భారత బ్యాట్స్ మెన్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మొదటి ఓవర్ లోనే రెండు పరుగులు వద్ద కెఎల్ రాహుల్ బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఓవర్లో తన వికెట్ ను చేజార్చుకున్నాడు.

దీంతో క్రీజులోకి వచ్చిన చత్తీశ్వర్ పూజరా.. మురళీ విజయ్ తో కలసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఆరు ఓవర్ల వద్ద 13 పరుగులతో వున్న టీమిండియా.. లంచ్ విరామ సమయానికి 86 పరుగులకు చేరకుంది. ఆ తరువాత ఇద్దరు బ్యాట్స్ మెన్లు నిలకడగా రాణించడంతో 34 ఓవర్లకు ఇద్దరు బ్యాట్స్ మెన్లు అర్థశతకాలను నమోదు చేసుకున్నారు. 34వ ఓవర్లో బౌండరీని బాదిన మురళీ విజయ్ తన టెస్టు కెరీర్ లో 15వ అర్థశతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్ మెన్ల మధ్య కూడా వంద పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది.

ఆ తరువాత అదే ఓవర్లో చత్తీశ్వర్ పూజారా కూడా అర్థసెంచరీని నమోదు చేశాడు,. తన టెస్టు కెరీర్ లో 12వ అర్థశతకంతో రాణించాడు. దీంతో 34 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు సాధించిన టీమిండియా జోడి.. 43 ఓవర్ల అనంతరం డ్రింక్స్ సమయానికి వికెట్ నష్టానికి 146 పరుగులు సాధించింది. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా పయనించడం గ్యారంటీ అని విశ్లేషకులు బావిస్తున్నారు. బ్యాటింగ్ అర్డర్ లో విరాట్ కోహ్లీ, రహానే, వృద్దిమాన్ సాహ, అశ్విన్, జడేజాలు వుండటం టీమిండియాకు మరింత కలిసివస్తుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Bangladesh  team india  bangladesh  murali vijay  cheteshwar pujara  hyderabad  cricket  

Other Articles