మీ మొబైల్ ఫోన్ కు ఐటీ మెసేజ్ వచ్చిందా..? government sends text messages to cash depositors during demonitisation

Government sends text messages to cash depositors during demonitisation

PM Modi, narendra modi, demonetisation, new software, central board of direct taxes, income tax department, hefty cash deposits, Sushil Chandra, new delhi

Huge deposits of Rs. 500 and Rs. 1000 notes following PM Modi's demonetisation move have come under the scanner, with the use of new government software.

మీ మొబైల్ ఫోన్ కు ఐటీ మెసేజ్ వచ్చిందా..?

Posted: 02/03/2017 12:02 PM IST
Government sends text messages to cash depositors during demonitisation

కేంద్ర ప్రభుత్వం నుంచి మీ మొబైల్ ఫోన్ కు టెక్ట్స్ మెసేజ్ వచ్చిందా..? మాకు రాలేదే.. ఏంటా మెసేజ్..? దాని సారంశంమేంటి..? అని అడుగుతున్నారా..? మెసేజ్ రాకపోతే మీకేం పర్వాలేదు. అయితే ఈ మెసేజ్ అందుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలి. మెసేజ్ ఏంటని అడుగుతుంటే ఇదంతా చెబుతారేం..? అక్కడికే వస్తున్నాం. డీమానిటైజేషన్ అదేనండీ పాత పెద్ద నోట్ల రద్దు చేసిన గత ఏడాది నవంబర్ 8 తరువాత నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో పాత పెద్ద నోట్లను డిపాజిట్ పెద్ద మొత్తంలో చేసిన వారందరికీ ప్రభుత్వం టెక్ట్స్ మెసేలు పంపింది.

పెద్ద నోట్ల రద్దు తరువాత ఎవరి ఖాతాల్లో ఎంత డబ్బు జమైందన్న వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా 5 లక్షలకు మించి తమ ఖాతాల్లో పాత నోట్లను జమచేసిన వారిందరికీ నోటీసులను పంపింది. పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

ఆదాయపన్ను శాఖ అధికారుల వద్దనున్న సమాచారం ప్రకారం 13 లక్షల మందికి ఇప్పటికే నోటీసులు పంపామని, మిగిలిన 5 లక్షల మందికి కూడా త్వరలో పంపుతున్నామని చెప్పారు. వీటితో పాటుగా మరో పది లక్షల మంది అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నామని, వారిలో అనుమానాస్పందంగా తేలిన వారికి కూడా త్వరలో నోటీసులను పంపనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి మెసేజ్ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చంద్ర స్పష్టం చేశారు. వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles