పాడె మీద ఓట్లు అడుక్కుంటున్నాడు | Election campaign comes alive on bier.

Up candidate election campaign comes alive on bier

Rajan Yadav, Arthi Baba, Chauri Chaura Constituency, Campaign on Bier, Rajghat Crematorium, Rajan Yadav Election Campaign, UP Candidate Bier, Bier Election Campaign

Rajan Yadav aka Arthi Baba, 34 the independent candidate’s election campaign comes alive on an ‘arthi’ (bier) which he rides in the battle of hustings.Chauri Chaura assembly constituency in Gorakhpur. For good measure, he washes the feet of voters in a bid to convince them of his humility.

పీక్స్: పాడె మీద ఎన్నికల ప్రచారం!

Posted: 01/23/2017 04:46 PM IST
Up candidate election campaign comes alive on bier

రొటీన్ కు భిన్నంగా ఉంటే అంతా మాట్లాడుకుంటారు కదా! అందుకేనేమో ఓ నేత ఇక్కడో వైవిధ్యభరితమైన ప్రచారానికి దిగాడు. మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్‌లోని చౌరీచౌరా నియోజకవర్గం నుంచి రాజన్‌ యాదవ్‌ అలియాస్‌ ‘ఆర్తి’ బాబా అనే 34 ఏళ్ల వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ‌రిలోకి దిగుతున్నాడు. ఆయనకు ఈసారి గెలుపు చాలా కీలకం. అందుకే జనాలను ఎక్కువగా ఆకట్టుకునేందుకు కొంచెం విన్నూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు.

అది చూస్తే ఎవరైానా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. రాజ్‌ఘాట్ శ్మ‌శానంలోనే ఆయన ఒక ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి పాడెపై ప్రచారానికి వెళతాడు. చేతిలో కుండ, గంట వాయిస్తూ... మైక్ తో తనకు ఓటేయాలంటూ విజ్నప్తి చేస్తున్నాడు. అలాగే ఓటర్ల ఇంటి వద్దకు వెళుతున్నాడు. ఆపై ఓట‌ర్ల కాళ్లు కడిగి తనకే ఓటు వెయ్యాలని కోరుతున్నాడు. అలాగని ఆయన్ని తక్కువ అంచనా వేయకండి. చిన్న రైతు కుటుంబంలో జన్మించిన రాజన్, గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ సంపాదించారు. కార్పొరేట్ జాబ్ ను వదులుకుని మరీ రాజకీయ రంగంలోకి దిగాడు.

‘‘సమాజంలో సామాన్యులు తమ హక్కులు పొందలేకపోతున్నారని, మ‌నుషులు బతికి ఉన్న‌ప్ప‌టికీ ఈ వ్యవస్థ చనిపోయినట్లుగా భావించేలా చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే తాను ఇలా ప్ర‌చారానికి వెళుతున్నాన‌ంటూ రాజన్ వివ‌రించారు. ఆ పాడెను ఆయ‌న‌ మద్దతుదారులు మోసుకుంటూ వెళుతుండ‌గా ఆయ‌న దానిపై కూర్చొని ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు.

ఇంతకు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయ‌న ఏకంగా నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లపై పోటీ చేద్దామ‌ని అనుకున్నాడు. మోదీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ వారణాసి నుంచి, రాజ్‌నాథ్ పోటీకి దిగిన ల‌క్నో నుంచి ఆయ‌న లోక్‌స‌భ స్థానాల‌కు నామినేషన్‌ వేయగా ఆయన దస్త్రాలను ఎన్నిక‌ల అధికారులు తిరస్కరించారు. అంతేగాక అప్ప‌ట్లో గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై కూడా పోటీకి దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈసారి మాత్రం గెలుపు తనదేనని చెబుతన్నాడు ‘ఆర్తి’(పాడే) బాబా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajan Yadav  Arthi Baba  Chauri Chaura  UP elections  Campaign Bier  

Other Articles