జల్లికట్టు ఆందోళనలో.. తగలబడిపోతున్న చెన్నై | Jallikattu protests take a violent turn in Tamil Nadu.

Jallikattu protest violence breaks out in chennai

Jallikattu protest, Violence in Chennai, Jallikattu protest in America, Chennai Jallikattu, Jallikattu Ordinance, Jallikattu Bill, Jallikattu petition, Menaka Gandhi Jallikattu

Jallikattu protest turns violent after police eviction. Violence in Chennai after police clash with protesters, many injured. Tamil-Americans hold rally in support of Jallikattu Washington.

జల్లికట్టుపై పిటిషన్.. ఆందోళనలు హింసాత్మకం

Posted: 01/23/2017 02:46 PM IST
Jallikattu protest violence breaks out in chennai

జల్లికట్టు నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. చెన్న‌య్‌, మ‌దుర‌యితో పాటు ప‌లు చోట్ల ఆందోళ‌న‌కారులు రోడ్ల మీదకు చేరి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. మెరీనా బీచ్ లో ఉన్న జనాలను ఖాళీ చేయించే క్రమంలో చిన్నగా మొదలై క్రమక్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. కోయంబ‌త్తూరులో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ఆ రాష్ట్ర‌ మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి అక్క‌డ‌కు చేరుకోగా ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన‌ వారిని చూసిన ఆందోళ‌నకారులు తీవ్రంగా మండిప‌డ్డారు. వెనుకకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తూ వెలుమణి, పోలీసు కమిషనర్‌ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జ‌రిగింది.

మరోవైపు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీతో చెల్లాచెదురు చేసి బీచ్ ని ఖాళీ చేయించ‌డంతో తమిళులు తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ పోరాటాన్ని హింసాత్మ‌కంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీసుల చ‌ర్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డుతూ వారిపై రాళ్లు రువ్వారు. మెరీన్ బీచ్ స‌మీపంలో ఉన్న ఐస్ హౌజ్ పోలీస్ స్టేష‌న్ ముందు ఉన్న ప‌లు పోలీసు, ప్రైవేటు వాహ‌నాల‌ను త‌గులబెట్టారు. కొంద‌రు ఆందోళ‌న కారులు పెట్రోల్ బాంబుల‌ను విసిరిన‌ట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేష‌న్ ముందు చెలరేగుతున్న మంట‌ల‌ను పోలీసులు అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పోలీస్‌స్టేషన్ ముందు ఉన్న కారు, ఆటో సహా 25 వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో సుమారు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్ ను అధికారులు రంగంలోకి దించి, ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్ర‌యోగం చేశారు. ఆందోళ‌న‌ల‌తో చెన్నయ్ నగరంలో పెద్ద ఎత్తున‌ ట్రాఫిక్‌జాం ఏర్ప‌డింది.

ఆ ప్రాంతంలో వంద‌ల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. చెన్నయ్ తో పాటు మధురైలో కూడా పోలీసులపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొంద‌రు యువ‌త ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని బెదిరిస్తున్నారు. ఆందోళ‌న కారుల‌ను చె‌ద‌ర‌గొట్టేందుకు పోలీసులు తీవ్రంగా య‌త్నిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో జల్లికట్టు ఆర్డినెన్స్ బిల్లు అయి తీరుతుందన్న నమ్మకాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ ప్రకటించాడు.

వ్యతిరేకంగా పిటిషన్...

జల్లికట్టుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి మేనకా గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జల్లికట్టులో జంతువులను హింసిస్తారని తన పిటిషన్‌లో పేర్కొంది. జల్లికట్టును పూర్తిగా నిషేదించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

అమెరికాలో కూడా...

మద్దతుగా ఇప్పుడు అమెరికాలో కూడా వంద‌ల సంఖ్యలో తమిళులు ఆందోళనకు దిగారు. అమెరికాలో ఉంటున్న త‌మిళులు ఈ రోజు వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. మ‌రోవైపు వర్జీనియాలోని నార్ఫోక్‌లో పెటా హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట కూడా తమిళులు నిరస‌న తెలిపారు. పెటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్ర‌ద‌ర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Supreme Court  Petition  Menaka Gandhi  Chennai  Protests  Violence  Jallikattu Ordinance  

Other Articles