కేటీఆర్ సూచన. చేనేతకు పవన్ చేయూత... ఎలాగంటే.. | Pawan Back to Branding for Handlooms after 15 years.

Pawan is brand ambassador for handlooms

Pawan Kalyan, brand ambassador, Handloom weavers, Telugu States, Pawan Chenetha, Pawan Kalyan Handloom, Handlooms new Brand Ambassador,

Actor, Janasena Party Chief Pawan kalyan openly come forward to support Handloom weavers in both the Telugu states. Pawan Kalyan voluntarily came forward and agreed to be the brand ambassador for the Handloom weavers in the Telugu states.

పదిహేనేళ్ల తర్వాత మళ్లీ పవన్

Posted: 01/18/2017 08:45 AM IST
Pawan is brand ambassador for handlooms

తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల దీనస్థితికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించాడు. చేనేతకు చేయూత నిచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం సంయుక్తంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని పవన్ ని వారు ఆహ్వానించగా, పవన్ అందుకు అంగీకరించాడు. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పవన్ ప్రకటించాడు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో 43 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్మికుల జీవన పరిస్థితులు మెరుగు పరిచేందుకు సహరించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేనేత పాలసీని తీసుకొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు గాను చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కలిగించేలా ప్రచారకర్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పవన్‌ కల్యాణ్‌ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమని తెలిపారు.

చేనేత మన జాతి సంపద అని, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు చేనేతకు చేయూతనివ్వాలని పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

Pawan Hand loom ambassador

పోలవరం బాధితులకు అపాయింట్ మెంట్..
మరోవైపు పోలవరం ముంపు బాధితులున కలిసేందుకు పవన్ అపాయింట్ మెంట్ ఇచ్చాడు. మూలలంక గ్రామస్థులు అధికారుల ఆగడాలపై పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఆవేదన అరణ్యరోదన కావడంతో పవన్ కల్యాణ్ సహాయం కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు వారు పవన్ కల్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలవనున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తున్నారని మూలలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ భూములు తమకు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles