ఆ అధికారి ల్యాప్ టాప్ నిండా మొత్తం పోర్నోగ్రఫీనే... | CID arrests American for huge child porn stash.

Child pornography techie arrested

US citizen, child porn, Hyderabad techie arrest, Child Pornography, Telangana CID, Hyderabad Pornography, huge child porn stash

US citizen arrested for circulating child porn from Hyderabad.

ఆన్ లైన్ లో అశ్లీల చిత్రాల అప్ లోడ్.. అరెస్ట్

Posted: 01/18/2017 08:30 AM IST
Child pornography techie arrested

నీలి చిత్రాలు, ఫొటోలను సేకరించి వివిధ వెబ్‌సైట్లలో అప్ లోడ్ చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాలను సైతం వదలకుండా అశ్లీల ఫోటోలతో నింపేస్తున్న అతగాడిని తెలంగాణ సీఐడీ మంగళవారం అరెస్టు చేసింది. యూఎస్ కు చెందిన జేమ్స్‌కిర్క్‌ జాన్స్‌ అనే వ్యక్తి హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీలో లీగల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. మాదాపూర్ లో ఓ అపార్ట్ మెంట్ లో అతగాడు నివసిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అతగాడికి చైల్డ్ ఫోర్నోగ్రఫీ బాగా అలవాటు ఉందంట. సుమారు 29,288 చైల్డ్‌ పోర్నోగ్రఫీ చిత్రాలున్న ల్యాప్‌టాప్, ఐఫోన్, హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు.

గత కొంత కాలంగా చిన్న పిల్లల నగ్న, అశ్లీల చిత్రాలను పోర్న్‌ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసి... వాటిని తిరిగి ట్విట్టర్, గిగాట్రైబ్‌ వంటి సోషల్ మీడియా సైట్లలో, ఇంకా పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. తద్వారా ఆదాయం సంపాదించటం కూడా చేశాడు. అయితే గత నెలలో ఢిల్లీలోని సీబీఐ, ఇంటర్‌పోల్‌ అధికారులు ఇతగాడి వేషాలను గుర్తించారు. వెంటనే రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారమివ్వగా, వారు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్‌ 67 (ఏ), (బి)కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇక అరెస్ట్ అనంతరం జేమ్స్‌ నివాసంలో సోదాలు నిర్వహించగా, వారికి పెద్ద షాకే తగిలింది. ఏకంగా 490 గిగాట్రైబ్, 24 ట్విట్టర్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలను షేర్‌ చేసినట్టు గుర్తించారు. పూర్తిగా పోర్నోగ్రఫీతో నిండిపోయిన ఒక ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US citizen  child porn  Hyderabad  arrest  

Other Articles