వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. విజయవాడలో ఉద్రిక్తత Tensions Erupt After Vangaveeti Statue Vandalized In Vijayawada

Tensions erupt after vangaveeti statue vandalized in vijayawada

kapu leader statue, vandalized, vangaveeti statue, vangaveeti ranga, vangaveeti radha, ranga statue distroyed, fans protest, tension in vijayawada

Tensions prevailed in parts of Vijayawada after the late Congress leader and Kapu icon Vangaveeti Mohana Ranga's statue was vandalized by unidentified persons on Saturday night.

వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. విజయవాడలో ఉద్రిక్తత

Posted: 01/15/2017 01:31 PM IST
Tensions erupt after vangaveeti statue vandalized in vijayawada

విజయవాడలో ఇవాళ ఉదయం ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. నగరంలోని సింగ్‌ నగర్‌లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర‍్తుతెలియని వ‍్యక్తులు శనివారం రాత్ర ధ‍్వంసం చేశారు. ఈ ఉదయం విషయం తెలుసుకున్న వంగవీటి రంగా అభిమానులు, వంగవీటి రాధా వర్గీయులు నిరసనలకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది. ప్రజల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నేతల సహకారంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టారని అందోళనకారులు ఆరోపించారు.

ఈ వార‍్త దావానలంలా వ్యాపించడంతో రంగా అభిమానులు పెద‍్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. రంగా విగ్రహాన్ని ధ‍్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష‍్టించాలని వారు డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక‍్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళవకారులకు నచ‍్చచెప్పారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట‍్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని వెల్లడించిన ఆయన, ఈ పనికి పాల్పడ్డవారిని ఊరికే వదలబోమని అన్నారు.

టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం పెరిగిపోయిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అరోపించారు. ఘటనా స్థలానికి వచ్చి ధ్వంసమైన రంగా విగ్రహాన్ని పరిశీలించిన వంగవీటి రంగా తనయుడు రాధా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహ ధ్వంసానికి పాల్పడినవారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles