Akhilesh yadav politely but firmly says no thanks to lalu

Akhilesh Yadav, Mulayam Singh Yadav, Samajwadi Party, Uttar Pradesh elections, UP polls, Lalu Prasad Yadav, shivpal yadav, amar singh, uttar pradesh politics

Lalu Yadav's exercise found no traction with Akhilesh Yadav, who took just minutes to reject the Bihar politician's proposal on making peace with his father.

‘‘మంచి కోరేవారైనా.. మాట వినను..’’ అఖిలేష్ ఝలక్

Posted: 01/11/2017 11:40 AM IST
Akhilesh yadav politely but firmly says no thanks to lalu

సమాజ్‌వాదీ పార్టీని హైజాక్‌ చేసి తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌తో పాటు ఆయన అప్తమిత్రుడిగా పేరొందిన అమర్ సింగ్, బాబాయ్ శివ్ పాల్ యాదవల్లకు గట్టి షాకిచ్చిన యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా మరో ప్రముఖ నేతకూ ఝలక్‌ ఇచ్చారు. రెండో పర్యాయం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ.. అందుకు అనుగూణంగా పార్టీ పావులు కదుపుతున్న అఖిలేష్ పార్టీ విషయంలో ఎవరు ఏమి చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేరు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు తాను ఎవరి మాట విననని తెగేసి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తనకు ఫోన్ చేసిన వృద్ద నేతతో మాట్లాడిన అఖిలేష్.. మీరు మా కుటుంబం మంచి కోరే వారు మీ మాట కాదనకూడదు.. పార్టీ మనుగడ, ఉనికి పరిరక్షించే క్రమంలో తాను ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలయ్యేంత వరకు ఎవరి మాటను వినలేనని తేల్చిచెప్పారు. ఇంతకీ ఎవరా నేత అంటారా..? ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్. సమాజ్ వాదీ పార్టీలో అలుముకున్న అంతర్గత తుపానును చల్లార్చే క్రమంలో ఆయన క్రీతం రోజు రాత్రి అఖిలేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు.

‘చూడుబాబూ.. ఎంతకాదన్నా ములాయం సింగ్ యాదవ్ ఆయన నీ తండ్రి. ఆయన రెక్కల కష్టంతోనే పార్టీ పెద్దదైందని గుర్తుంచుకో. తక్షణమే నేతాజీని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించి, ఆయన చెప్పినట్లు విను..’ అని సలహా ఇచ్చారు. లాలూ ఇచ్చిన సలహాకు థ్యాంక్స్‌ చెబుతూనే.. ‘మా మంచి కోరే వ్యక్తిగా మీ మాట కాదనకూడదు. కానీ పరిస్థితి చేయిదాటింది. ఎన్నికలు అయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు నావే. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరు క్షణంలో పార్టీ పగ్గాలను సగౌరవంగా నేతాజీ(ములాయం)కి అప్పజెపుతా. అప్పటిదాకా మీరే కాదు.. ఎవరు చెప్పినా వినేదిలేదు’అని అఖిలేశ్‌ తెగేసి చెపారు.

తన పోరాటం తండ్రి(ములాయం)పై కాదని, ఆయనను చుట్టుముట్టిన దుష్టశక్తుల(శివపాల్‌ యాదవ్‌, అమర్‌సింగ్‌)పైనేనని అఖిలేశ్‌.. లాలూతో అన్నట్లు తెలిసింది. పార్టీపై పూర్తి పట్టు సాధించిన తరుణంలో ఒకవేళ మళ్లీ నేతాజీకి పగ్గాలు అందిస్తే, ఆయన బలంగా నమ్మే శివపాల్‌ యాదవ్‌, అమర్‌ సింగ్‌లు మళ్లీ బలం పుంజుకుంటారని, తద్వారా పార్టీకి చేటు జరుగుతుందని అఖిలేశ్‌ నమ్ముతున్నారు. ప్రస్తుత తరుణంలో ములాయంలేని పార్టీకి మనుగడలేదని తెలుసుకాబట్టే అఖిలేశ్‌.. తండ్రిని మాత్రమే గౌరవిస్తూ ఆయన చుట్టూ ఉన్నవారిని టార్గెట్‌ చేశారు. ఇటు ములాయం కూడా కొడుకువైపే ఉన్నట్లు ఇటీవల ప్రకటనలతో తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Airasia india offers 50 discount on round trips

  ఏయిర్ ఏసియా టూ అండ్ ఫ్రో డిసౌంట్ ఆఫర్

  Jan 24 | చౌకధర విమానయాన పోటీలలో భాగంగా గత నాలుగు నెలలుగా వరసగా ఢిసౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను అకర్షిస్తున్న బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం... Read more

 • Rbi has no clue about fake currency detected post demonetization

  ‘‘నకిలీ కరెన్సీ అంతా తూచ్’’ రికార్డులు లేవన్న ఆర్బీఐ

  Jan 24 | పాత పెద్ద నోట్ల రద్దును ఎందుకు చేపడుతున్నాం అన్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్ 8న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తూచ్.. అని అర్బీఐ అనిందా..?... Read more

 • Chef throws chilli powder on customer for complaining about food

  ITEMVIDEOS: వంటలు రుచిగా లేవంటే.. ఇలా కూడా జరగోచ్చు..

  Jan 24 | వీకెండ్ రోజునో లేక ఏదైనా విశేషమున్న రోజునో మీ కుటుంబంతో పాటు మంచి రెస్టారెంటుకు వెళ్లి.. తృప్తిగా భుజించి వద్దామనుకుంటున్నారా..? మీ స్నేహితులకు బర్త్ డే స్పెషల్ గా రెస్టారెంట్ లో ఫుడ్ పార్టీ... Read more

 • Gang rape live streamed on facebook in sweden

  దారుణం: ఫేస్ బుక్ లైవ్ లో గ్యాంగ్ రేప్

  Jan 24 | మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగిపోతున్న క్రమంలో మానవత్వాన్ని మరిచి ఓ మూడు మృగాలు చేసిన వికృత క్రీడ సంచలనంగా మారింది. ఓ 30 ఏళ్ల మహిళను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేయటమే కాదు,... Read more

 • Navjot singh sidhu for cm posters surface in east amritsar

  సిద్దూకే సీఎం పీఠం.. మర్మమేమిటో చెప్పిన కెప్టెన్..!

  Jan 24 | ఎన్నికల వేళ.. ప్రత్యర్థుల కుయుక్తులను, కుట్రలను తట్టుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు తప్పక ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి అవసరం ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీజేపీ పార్టీకి తిలోదకాలు ఇచ్చి..... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno