సైబర్ సెక్యూరిటీపై పటిష్ట చర్యలకు అర్బీఐ అదేశం RBI Fears Cyber Attack On Prepaid Payment Instruments

Rbi asks ppi issuers to conduct security audit

PPI,Reserve Bank of India,RBI,Prepaid Payment Instruments,special security audit,cyber attack,Cyber attack on prepaid payment instruments

With the withdrawal of legal tender characteristics of old notes, the use of alternate modes of payment, specifically e-wallets, has gained momentum

సైబర్ సెక్యూరిటీ అందరి మదిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న

Posted: 12/10/2016 11:44 AM IST
Rbi asks ppi issuers to conduct security audit

దేశాన్ని క్యాష్ లెస్ ఎకానమీగా మార్చాలని, ఇకపై అన్ని డిజిటల్ మనీ విధానంలోనే కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అటు భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా డిజిటల్ మనీ గురించి అవగాహన వున్న ప్రజల మదిని తొలుస్తున్న ప్రశగా మారింది సైబర్ సెక్యూరిటీ. వీరితో పాటు పార్లమెంటులో విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అర్బీఐ కూడా ఈ దిశగా దృష్టి సారించింది.

డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో సైబర్ మోసాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (పీపీఐ) జారీ చేస్తున్న బ్యాంకులు, కంపెనీలను సూచించింది. భద్రతపరమైన వ్యవస్థ పటిష్టతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాలు.. ముఖ్యంగా ఈ-వాలెట్ల వాడకం పెరిగిం దని ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త ఖాతాదారులు, వ్యాపారస్తులను సమకూర్చుకునే ప్రయత్నాల్లో సైబర్ భద్రతకు సంబంధించి ఏ చిన్న ప్రతికూల ఉదంతం చోటు చేసుకున్నా.. మొత్తం డిజిటల్ సాధనాలపై ప్రజలకు విముఖత ఏర్పడే అవకాశం ఉందన్న సంగతి గుర్తెరగాలని ఆయా బ్యాంకులు, సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది.

ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌‌స టీమ్(సెర్ట్-ఇన్)కి చెందిన ఆడిటర్లతో సైబర్ భద్రత చర్యలపై ఆడిట్ జరిపించుకుని, దిద్దుబాటు చర్యలేమైనా ఉంటే తక్షణం అమలు చేయాలని పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు భారతీయ బ్యాంకులకు చెందిన సుమారు ఆరు లక్షల మంది కస్టమర్ల అకౌంట్ డీటైల్స్ హ్యాక్ చేసిన విషయం వెలుగులోకి రావడంతో.. బ్యాంకులు వారికి కొత్త కార్డులను జారీ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles