పన్నీర్ సెల్వంకు ఎంపిక పక్కా ఫ్లానింగ్ తోనే.. అదేంటంటే... | Political game with Paneerselvam making CM for Tamil Nadu.

Paneerselvam political choice for tn cm

Panneerselvam new Tamil Nadu CM, O Paneerselvam, Sasikala Natarajan Panneerselvam, Panneerselvam VIkho, MDMK Leader Vaiko Panneerselvam, Jayalalitha Aid Sasikala Natarajan

Panneerselvam is new Tamil Nadu CM but behind the throne is Sasikala Natarajan.

పన్నీర్ కు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు???

Posted: 12/06/2016 10:50 AM IST
Paneerselvam political choice for tn cm

అన్నాడీఎంకే పార్టీ అధినేత మృతితో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా పార్టీతో గాఢ అనుబంధం పెనవేసుకుపోయిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవటంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాలనాపరంగా గాడి తప్పొద్దన్న ఉద్దేశ్యంతో రాత్రికి రాత్రే విధేయుడు, గతంలో రెండుసార్లు సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీర్ సెల్వంను సీఎంగా చేశారు. అయితే 24 గంటలు గడవక ముందే రాజకీయ కుట్రలు మొదలైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

అసలు జయ పగ్గాలు చేపట్టాక అన్నాడీఎంకే కాస్త ‘అమ్మ’ డీఎంకేగా మారిపోయిందని సీనియర్లలో అసంతృప్తి ఉందనేది ఒప్పుకోవాల్సిన సత్యం. అయితే పార్టీతో అనుబంధం పెనవేసుకుపోయిన ఆమె దానిని అలాగే తొక్కి పట్టి ఉంచింది. ఇక రెండు నెలలకు పైగా చికిత్స తర్వాత జయ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇలా చనిపోయిందన్న వార్త వచ్చిందే లేదో అప్పుడే వెనకాల కుట్రలు మొదలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

గతంలో జయ లీగల్ కేసులను ఎదుర్కొంటున్నప్పుడు రెండుసార్లు (2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటో తేదీ వరకు, 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు) సీఎంగా పనిచేశారు. ఆయన సీఎంగా పనిచేసినా జయ పరోక్షంలోనూ ఆమె పట్ల విధేయత ప్రకటించారు. అలాంటప్పుడు పూర్తి స్థాయి పగ్గాలు ఇచ్చేంత సీన్ ఆయనకు లేదని అంటున్నారు. ఇంతకు ముందు పదవీచ్యుతురాలు అయినప్పుడు సెల్వం పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వారంతా కాచుకుని ఉన్నారంట. ఇక ఇప్పుడు అమ్మ మొత్తానికే లేకపోవటంతో వారి లైన్ క్లియర్ అయ్యి ఆధిపత్య పోరు ప్రారంభమైందని చెప్పుకుంటున్నారు. జయ ఆస్పత్రిలో ఉండగా పార్టీలో మూడు అధికార కేంద్రాలు నడిచినట్టు ప్రచారం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పాలనాపరంగా జయ వ్యవహారాలన్నీ చూసేవారు. జయ సలహాదారు కూడా అయిన ఆమె అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపించారు.

ఇక జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టేవారు. జయ పరోక్షంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన పన్నీర్ సెల్వం తాజాగా ఆమె మృతి తర్వాత కూడా ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మూడో వ్యక్తి జయలలిత నెచ్చెలి శశికళ. ‘అమ్మ’ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ ఆమె జయ పక్కనే ఉన్నారు. జయ అధికారంలో ఉండగా ఆమె రెండో అధికార కేంద్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. పన్నీర్ సెల్వంను సీఎంగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వెనక ఆమె హస్తం ఉందని సమాచారం.

అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంను అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు ఏమేరకు అంగీకరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే 136 స్థానాల్లో అన్నాడీఎంకే జయకేతనం ఎగరవేసింది. అయితే వీటిలో 60 మంది ఎమ్మెల్యేలు శశికళ కోటరీకి చెందినవారే. అంతేకాదు, వీరిలో 12 మంది మంత్రులు కూడా వున్నారు. పన్నీర్ సెల్వంపై శశికళకు విశ్వాసం లేకపోయినా అప్పుడే పదవుల కోసం వెంపర్లాడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆమె వెనక్కి తగ్గినట్టు సమాచారం.

పన్నీర్ సెల్వంను సీఎంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రకటించడం వెనక ఉన్న కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీని అస్థిరపరిచేందుకు డీఎంకే నుంచి ప్రయత్నాలు కూడా ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో సాధారణ పరిస్థితులే ఉన్నా మరికొన్ని నెలల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని వారు అంటున్నారు.

పన్నీర్ ప్రస్థానం...
పన్నీర్‌సెల్వం దక్షిణాది తమిళనాడులో బలమైన థేవార్స్ - మారవార్ సామాజిక వర్గానికి చెందిన వారు. థేనీజిల్లాలోని పెరియాకులంలో 1970వ దశకంలో స్నేహితుడు విజయన్‌తో కలిసి రోజీ క్యాంటిన్ పేరిట టీ షాప్ ప్రారంభించారు. దీన్ని పీవీ క్యాంటిన్ అని కూడా పిలిచేవారు. 1980వ దశకం చివరిలో తన సోదరుడు ఓ రాజాకు పీవీ క్యాంటిన్ అప్పగించిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీఆర్‌కు అభిమాని. ఎంజీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత పన్నీర్ సెల్వం పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో ఎంజీఆర్ మృతి తర్వాత రెండు చీలిన అన్నాడీఎంకేలో తొలుత జాన కీ రామచంద్రన్‌కు మద్దతు పలికారు. తర్వాత జయ కు మద్దతు తెలిపిన పన్నీర్ సెల్వం 1996లో పెరియాకులం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అన్నాడీఎంకే పటిష్టంగా ఉండడానికి కారణం థేవార్ల మద్దతేనంటారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడు నుంచి 10 స్థానాలకు అన్నాడీఎంకే విజయంలోనూ సెల్వందే కీలక పాత్ర. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో థేవార్ల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Tamil Nadu new CM  Sasikala Natarajan  Jayalalitha Aid  

Other Articles