స్పైస్ జెట్.. వార్షిక స్పైసీ సేల్ బంఫర్ ఆఫర్.. Go Air announces airfares starting at Rs 736

Go air announces airfares starting at rs 736

demonitisation, Go Air, rs 736 ticket, SpiceJet Rs 737 offer, SpiceJet sale, SpiceJet Annual Sale, SpiceJet ticket sale, AirAsia Sale, All-Inclusive Tickets, Rs. 737, Annual Sale,

GoAir offer: Budget airliner, launched a low fare offer for its consumers. The offer for its consumers starts from as low as Rs 736 inclusive of all taxes.

గో ఎయిర్ బంఫర్ ఆఫర్.. రూ.736కే దేశీయ విమానయానం..

Posted: 11/23/2016 05:52 PM IST
Go air announces airfares starting at rs 736

చౌకధరల విమానయానం యుద్దం మళ్లీ తెరపైకి వచ్చింది. విమాన ప్రయాణాలు తగ్గిన నేపథ్యంలో స్పైస్ జెట్  బంఫర్ అఫర్ ను ప్రకటించిన 48 గంటల వ్యవధిలోనే మరో ఏకానమీ విమానయాన సంస్థ గో ఎయిర్ కూడా అదే బాటలో పయనించింది. స్పెస్ జెట్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్ కింద రూ.737ల నుంచి విమానయాన సౌకర్యాన్ని అందించగా, గో ఎయిర్ దాని కన్నా ఒక్క రూపాయి తక్కువకు అంటే రూ. 736 కు నిర్ధేశిత రూట్లలో విమానయాన సౌకర్యాన్ని కస్టమర్లకు కల్పిస్తుంది.

ఈ ఆపర్ కింద రెండు రోజులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఆపర్ కింద ప్రారంభమయ్యే అమ్మకాలు శనివారం రాత్రి వరకు మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. గురువారం రాత్రితో ఈ అఫర్ ముగుస్తుందని తెలిపింది. రూ.736 (అన్నిచార్జీలు కలిసి)తగ్గింపు ధరలను  దేశీయ ప్రయాణాలపై అనుమతించనుంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి9 - మార్చి 31 2017 ల   మధ్య ప్రయాణించవచ్చు. గో ఎయిర్ నెట్‌వర్కులు అన్నింటిలోనూ.. అంటే, గో ఎయిర్ వెబ్‌సైట్, టికెటింగ్ కౌంటర్లు, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లన్నింటికీ ఈ తగ్గింపు వర్తిస్తుంది.
 
అయితే, గ్రూప్ డిస్కౌంటులు, ఇన్‌ఫాంట్ బుకింగ్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న మరే ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో కలిపి దీన్ని వాడటానికి వీలుండదు. ప్రామాణిక రద్దు, రీబుకింగ్ విధానాలకు అనుగుణంగా ధరలుంటాయి. మరోవైపు.. గురువారం అర్ధరాత్రి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను తమ టికెటింగ్ కౌంటర్లలో అనుమతిస్తామని కూడా గో ఎయిర్ ప్రకటించింది. అయితే, ఈ నోట్లతో బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి గానీ, మార్చుకోడానికి గానీ కుదరదని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonitisation  Go Air  rs 736 ticket  spicejet  spicy annual sale  airasia  airline  airways  

Other Articles