కేసీఆర్ థమ్స్ అప్.. బాబు డౌన్ | KCR most popular and best CM 2016

Kcr most popular and best cm 2016

Telangana CM KCR, KCR, KCR 2016 best CM, most popular CM 2016, VDP associates survey best CM, Best CM 2016, KCR most popular and best CM, VDP associates survey 2016

KCR most popular and best CM 2016 in VDP associates survey.

మోస్ట్ పాపులర్ సీఎంగా కేసీఆర్

Posted: 10/29/2016 07:52 AM IST
Kcr most popular and best cm 2016

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంగా ఆయన నిలిచాడు. ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

ప్రజాదరణ విషయంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారని పేర్కొంది. గతేడాది ఆయన 85వ శాతం ఉండగా, వివిధ అభివృద్ధి పనులతో ఈ యేడాది ఆ పాపులారిటీ 2 శాతం పెరగటం విశేషం. ఇక తర్వాత 85 శాతం రేటింగ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో, 79 శాతం రేటింగ్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు.

గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత 75 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్, ఫడ్నవీస్, నితీశ్ కుమార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక గతేడాది ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన చంద్రబాబు పాపులారిటీ దారుణంగా పడిపోవటంతో, 58 శాతంతో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేతో కలిసి సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచారు. విజయ్ రూపానీ, సిద్ధరామయ్య, అఖిలేష్ యాదవ్ తర్వాతి స్థానంలో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  most popular and best CM  2016 VDP associates survey  

Other Articles