రాంచరణ్ ట్రూజెట్ పై బురదజల్లుతున్నారు..? అది బాబు కానుక కాదు wrong propoganda on ram charan trujet airlines

Wrong propoganda on ram charan trujet airlines

It is purely wrong propoganda on Mega Power Star Ramcharan Tej airlines Trujet, that Andhra Pradesh government has given Rs 4.9 Cr rupees as gift, but fact is that it has given as a part of viability gap funding in Trujet Reginal connectivity scheme

It is purely wrong propoganda on Mega Power Star Ramcharan Tej airlines Trujet

బాబు కానుక కాదు.. రాంచరణ్ ట్రూజెట్ పై బురదజల్లుతున్నారు..!

Posted: 10/28/2016 06:18 PM IST
Wrong propoganda on ram charan trujet airlines

టాలీవుడ్ మోగా పవర్ స్టార్ రాంచరణ్ డైరెక్టర్ గా వున్న ట్రూజెట్ విమానాయాన సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఉదారతను చూపించిందా..? తా ప్రేమానా..? మెగాస్టార్ చిరంజీవికి తనయుడైన చరణ్ కు చంద్రబాబు సర్కార్ నిజంగానే కానుకనందించిందా.? దీపావళి పండగ పర్వదిన కానుకగా చరణ్ విమానయాన సంస్థ ట్రూజెట్ కు సుమారు ఐదు కోట్ల రూపాయలను అంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిందా.? నిజానిజాలు తెలియని వారు మాత్రం ఔననే అంటున్నారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్ అసలెందుకు అ డబ్బులిచ్చింది అని అరా తీసేవాళ్లు ఎంతమంది..?

తన ప్రభుత్వం తరపున ఐదు కోట్ల రూపాయలను ఇచ్చే హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబాుకు వుందా..? క్రీడాకారుడు కాదు, పతకాలను సాధించలేదు, సీనీహోరోగా అరుదైన గౌరవం కోద్ది ఇచ్చారా.? అంటే ఏ ప్రతిపాదికన ఇస్తారు.? రాంచరణ్ సాధించిందేమిటి..? ఎందుకని అంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కర్ అప్పన్నంగా ఐదు కోట్ల రూపాయల డబ్బునిచ్చింది...? ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇలా డబ్బులిచ్చే అధికారం చంద్రబాబు ప్రభుత్వానికి వుందా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

రాష్ట్ర పురోగాభివృద్ది కోసం, రాజధాని లేని రాష్ట్రంలో అత్యాధునిక రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వ ఉద్యోగల నుంచి కాసు నుంచి కాస్ట్టీ బంగారు అభరణాల వరకు.. చెవిదుద్దుల నుంచి మంగళసూత్రాల వరకు విరాళాల పేరిట నిలువు దోపీడి చేసిన చంద్రబాబు సర్కార్.. రాంచరణ్ విమానయాస సంస్థకు ఎందుక ఉదారతను ప్రకటించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో ప్యాకేజీ రాకపోయినా.. బహుమతిని ఎలా అందించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం రాంచరణ్ తేజ్ కు నేరుగా డబ్బులివ్వకుండా విమానయాన సంస్థకు ఎందుకిచ్చారన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.

చంద్రబాబు ప్రభుత్వం ఉదారతను చాటుకుంటుందా..?

సిరిగలవానికి చెల్లును 16 వేల మంది సతుల పెండ్లాడన్ అని శ్రీనాధ మహాకవి రాసిన పద్యం ఇక్కడ గుర్తుకువస్తుంది. రాష్ట్రానికి అదాయమే లేదని, నిధుల కోరత వెంటాడుతుందని, తమను అన్యాయం చేసిన అనాధగా వదలేశారని గత రెండున్నరేళ్ల క్రితం ప్రజల్లోకి వెళ్లి.. అంగలార్చిన చంద్రబాబు... తాజాగా హోదా విషయంలోనూ ఇదే మాటలను చెప్పి కేంద్రం నుంచి జనం మెచ్చని ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకున్నారు. అలాంటి చంద్రబాబు తన ఉదారతను చాటుకుని రాంచరణ్ విమానయాస సంస్థకు ఐదు కోట్ల రూపాయలను ఎలా ఇస్తారు..?

తన ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితాలు జనంలోకి వెళ్లని పక్షంలో ఎదో ఒక హంగూ అర్భాటం చేసి ప్రభుత్వ వ్యతిరేకతను అటు దిశగా దృష్టి మరల్చి ఔరా అని అనిపించుకోవడంలో చంద్రబాబు చతురత, చాణక్యత గురించి తెలిసిన వారికి చెప్పనవసరం లేదు. తన హాయంలో సమైక్య రాష్ట్రంలో కరువు కాటు రైతులు తనవులు చాలిస్తుంటే.. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించి.. దాని ప్రారంభానికి కేంద్ర మంత్రులు నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రాష్ట్ర నేతలతో పాటు సినీ ప్రముఖులను అహ్వానించి రంగరంగ వైభవంగా వేడుక నిర్వహించి ప్రజలు దృష్టిని మరల్చిన విషయం తెలిసిందే.

రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా ఒకవైపు ప్రతిపక్షాలు అందోళన చేస్తున్నా..? వాటిని పెడచెవిన బెట్టిన టీడీపీ సర్కార్ ట్రూజెట్ ప ప్రేమను కనబర్చడానికి కారణమేంటి.? ఏపీ విపక్ష నేత జగన్ సభల్లో నిరుద్యోగ యువతీ యువకులు తమకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల హామి ఇచ్చినందుకే టీడీపీకి ఓటు వేశామని, అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పైసా కూడా నిరుద్యోగ భృతి రాలేదని.. నిగ్గదీసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం రాంచరణ్ కు ఎందుకు కానుకలిచ్చింది.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవతున్నాయి.

రాంచరణ్ ట్రూజెట్ ఎయిర్ వేస్ కు చంద్రబాబు సర్కార్ కు సంబంధమేమిటీ..?

విమానయాన సంస్థలకు కానులిచ్చే అధికారమే రాష్ట్ర ప్రభుత్వాలకు వుండివుంటే కింగ్ ఫిషర్ విమానయాన సంస్థ విజయ్ మాల్యాను అపత్కాల సమయంలో అదుకునేందుకు ఏ ఒక్క రాష్ట్రప్రభుత్వమూ ముందుకు వచ్చేది కాదా..? ఆయనకు కానుకలు, తాయిలాలు ప్రకటించేవారు కాదా..? తను నుంచి లబ్ది పోందినవారిలో అనేక మంది రాజకీయ నాయకులు, పత్రిక సంపాదకులు వున్నారని, తాను చేసిన మేలు మర్చి ఇప్పడు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని స్వయంగా ఆయనే వ్యాఖ్యానించి దారుణమైన పరిస్థితులను ఎందుకు కొనితెచ్చుకునేవారు..? దేశాన్ని వదలి ఎందుకు పారిపోయే వారన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.

అవును కాదా.. అంటారా..? స్వయంగా కేంద్ర మంత్రలతో అవినాభావ సంబంధాలున్న మాల్యాను అదుకునేవారు కాదా..? అంటారా..? అలాంటప్పుడు రాంచరణ్ తేజ విమానయాన సంస్థకు చంద్రబాబు సర్కార్ ఎందుకు కానుకులు ఇచ్చింది. ఇందులో ఎంత నిజముంది.? ఇది వాస్తవమేనా..? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతవరకు పలు మాద్యమాలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు అంటే నచ్చకో.. లేక రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతోనే ఆయన కుమారుడు డైరెక్టర్ గా వున్న ట్రూజెట్ సంస్థకు కానుకలిచ్చారంటే.. ఔనా నిజమేనా అన్నవారి శాతమే అధికంగా వుంది. అందకనే పాఠకులకు నిజానిజాలు మేము మీకు అందజేస్తున్నాం.

మోడీ సర్కార్ ఉడాన్ పథకంలో భాగమేనా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు ఉడాన్ పథకంలో భాగంగానే కేంద్ర విమానయాన శాఖ నిర్ధేశించిన అదేశాల మేరకు రాంచరణ్ తేజకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిదులను విడుదల చేసిందా..? అంటే అవుననే చెప్పాలి. దేశంలో నిరుపయోగంగా వున్న విమానాశ్రాయాలతో పాటు వారానికి ఒకటి రెండు విమానాలను సర్వీసులను మాత్రమే అందించే విమానాశ్రాయాలను కూడా ఇకపై పూర్తిస్థాయిలో పినచేసేలా.. రూపకల్పన చేసిన పథకమే ఉడాన్. ఈ పథకాన్ని అమలు చేస్తామని, దేశంలోని సామాన్యులకు కూడా విమానయాన అవకాశాన్ని అందిస్తామని బీజేపి ఎన్నికల హామీని కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ పథకం కింద గంటలోపు ప్రయాణాలు సాగించే పలు విమానాశ్రయాలకు కేవలం రూ.2500 చార్జితో మాత్రమే గమ్యస్థానాలను చేరుస్తారు, దీంతో తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేలా 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) అనే పథకానికి మోడీ సర్కారు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. విమానంలోని సీట్లలో కనీసం 50 శాతం సీట్లను ఉడాన్ స్కీమ్ కింద విక్రయించాల్సి వుంటుంది. మిగిలిన సీట్లు మార్కెట్ ఆధారిత ధరల విధానంలో విక్రయించుకోవచ్చు. ఈ తరహా స్కీమ్ రూపకల్పన కావడం ప్రపంచ విమానయాన రంగంలో ఇదే తొలిసారి.

ఉడాన్ లో భాగంగానే రిజనల్ కనెక్టివిటీ పథకం
 
కేంద్రంలోని మోడీ సర్కార్ ఉడాన్ పథకాన్ని అందుబాటులో తీసుకురావడం వెనుకనున్న సదుద్దేశం మరోకటి వుంది. అదేమనగా, దేశంలోని చిన్న నగరాలలో సమతూత్యత తీసుకురావడం. సమతుల్య సమగ్రాభి వృద్దితో పల్లె పట్టణాలకు పునర్ వైభవం తీసుకురావడం. ఇందులో భాగంగా విమానాశ్రాయలు వున్న నగరాలను అంతర్గతంగా కనెక్ట్ చేయడం ద్వారా దేశంతోని అన్ని ప్రాంతాలు అభివృద్దికి నోచుకుంటాయని, దీంతో నగరాలకు వచ్చే వలస బతుకులకు చెక్ వెట్టవచ్చని కేంద్రం భావిస్తుంది.

ఈ స్కీములో భాగంగా దేశవ్యాప్తంగా వున్నా సుమారు 400 విమానాశ్రాయలకు మోదా సర్కార్ జీవకలను అందిస్తుంది. దీంతో పాటు తాము కూడా విమానాశ్రాయాలుగా చెప్పుకునేందుకు తప్ప మరెందుకు వినియోగం కానీ విధంగా వారానికి ఒకటి రెండు విమాన సర్వీసులను మాత్రమే అందిస్తున్న విమానాశ్రయాలకు జీవకల అందించనుంది. దీంతో అక్కడ విమానాశ్రాయాలకు విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి కల్పనకు కూడా నాంది పలుకుతుంది. పత్రక్ష, పరోక్ష ఉపాధిలతో స్థానిక యువత జీవనం సాధించడంతో వారి నగర వలసబాట్లను కేంద్రం నిలువరించనుంది.

కేంద్రం ఇందుకు పలు మార్గదర్శకాలను కూడా అమల్లోకి తీసుకువచ్చింది. పర్యాటక, ఉపాధి మరియు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సాహించడానికి పౌర విమానయాన రంగం గణనీయమైన పెరుగుదలకు ఈ ఉడాన్, అర్ సీ ఎస్ పథకం దోహదపబనుందని విమానాయాన శాఖ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పాటు దేశ సమగ్ర పర్యావరణ వ్యవస్థకు కూడా మార్గం ఏర్పడుతుందన్న కేంద్రవర్గాలు..  ప్రాంతీయ కనెక్టివిటీ విస్తరించేందుకు దోహదపడుతుందని అంటున్నాయి.

పథకాలు సరే.. మరి ప్రయాణికుల మాటేమిటీ.?

ఉడాన్ పథకంలో భాగంగా ఈ రీజనల్ కనెక్టివీటీ వున్న విమానాశ్రాయాలకు వెళ్లేందుకు మాత్రమే గంటకు 2500  రూపాయల చార్జి వర్తంచనుంది. ఆయా ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఈ చార్జీకి మించి డబ్బును వసూలు చేయరాదని కేంద్ర విమానయానశాఖ అదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లాలని భావించేవారు ఈ ఉడాన్ పథకంతో ప్రయాణించవచ్చు. అయితే ధర తక్కువగా వున్నందున ఉన్నత మధ్య తరగతి, మద్యమ మధ్య తరగతి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కేంద్ర అంచనా వేసింది.

రైలు ప్రయాణాలను విమానయానానికి బదిలీ చేయడంతో భాగంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారా..? అంటే కూడా ఔవును అనే సమాధానాలే వినబడుతున్నాయి. రైల్వో ఏసీ, ఏసీ టూ టైర్, త్రీటైర్ లలో ప్రయాణించే వారు అనేక వ్యవప్రయాసలు పడేందుకు బదులు ఈ పథకాన్ని వినియోగించుకుంటారని కేంద్రం బావిస్తుంది. దీంతో అటు చార్జీల రూపనే పోల్చినా, తక్కువ ధరలో గమస్థానాలు చేరడంతో పాటు ఎంతో విలువైన సమయం కూడా అదా అవుతుంది. అరు నుంచి ఏనమిది గంటల ప్రయాణ సమయాన్ని కేవలం గంట వ్యవధిలో చేర్చడంతో అనేక మంది దీనిని అశ్రయిస్తారని కూడా కేంద్రం భావిస్తుంది.

పథకాలు సరే.. విమానాల మాటేంటి..?

నిరుపయోగంగా వున్న విమానాశ్రయాలకు పునరుజ్జీవం కల్పించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉడాన్, ఆర్ సీఎస్ పథకాలు మాట అటుంచింతే.. ఈ పథకాలతో విమానయాస సంస్థలకు నష్టం చేకూరదా..? ఎప్పుడు ఓ సారి వచ్చే ప్రయాణికుడి కోసం వారినికి ఏడు ఫ్లైట్లు ఇప్పటి నుంచే నడపాలంటే సాధ్యపడే పనేనా..? విమానయాస సంస్థలు ఈ ప్రయాణికులు లేని రూట్లలో విమానాలను నడిపేందుకు ముందుకోస్తారా..? అంటే అందుకు కూడా కేంద్రం ఓ తరుణోపాయాన్ని అలోచించింది.

పారిశ్రమవర్గాల పక్షపాతిగా విపక్షాలు విమర్శలను అందుకున్న ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ విమానయాన సంస్థలకు కూడా పలు మినహాయింపులను ఇచ్చారు. ఈ పథకంలో ముందుకువచ్చి విమానాలను నడిపే విమాన సంస్థలకు కూడా పలు తాయిలాలు ప్రకటించింది. వారికి నష్టాలను రాకుండా చూసుకునేందుకు వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏటీఎఫ్ పై 1 లేదా అంతకన్నా తక్కువగా వసూలు చేయడానికి అంగీకరించే రాష్ట్రాలలో మాత్రమే ఈ అర్ సీ ఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకోచ్చారు. దీంతో పాటు ఈ పథకంలో భాగంగా 20 శాతం వీజీఎఫ్ భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం కావాలి. వీటితో పాటు నామమాత్రపు ధరలకే సపోర్టివ్ సర్వీసులను అందజేయాలి.

ఈ పథకం కింద ఇంకా:
* వాటాదారుల ద్వారా రాయితీలు కల్పించడం
* విమానాశ్రయ చార్జీలు వసూలు చేయకపోవడం
* ఒక్క సంవత్సరం పాటు విమాన టిక్కెట్ చార్జీలపై సర్వీసు టాక్సుపై లలో కూడా రాయితీ కల్పించడం
* రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఫైర్ సేవలను ఉచితంగా అందించడం
* విద్యుత్, నీరు, ఇతర వినియోగాలను రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రేట్లపై కల్పించడం
* దేశీయ విమానాల డిపార్చర్లపై తక్కువ మొత్తంలో పన్ను విధించిన దాని ద్వారా వీజీఎఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం.
* వీజీఎఫ్ ఫండ్ లో కేంద్ర విమానయాన శాఖ 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం కల్పించనున్నాయి.
ఇలా అనేక నిబంధలను పెట్టి పలు రూట్లలో విమానాలను నడిపేందుకు విమానయాన సంస్థలను కేంద్రం టెండర్ల ద్వారా అహ్వానించింది.

రాంచరణ్ ట్రూజెట్ విమనాయాన సంస్థకు కాంట్రాక్టు

రాష్ట్రాభివృద్దిలో భాగంగా తమ సంస్థకు కొంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. రాష్ట్ర ప్రజలకు తమ సంస్థ ద్వారా సేవలందించేందుకు ముందుకు వచ్చాడు రాంచరణ్ తేజ్. కేంద్ర విమానయాన శాఖ తీసుకువచ్చిన అర్సీఎస్ పథకంలో భాగంగా విజయవాడ–తిరుపతి,  విజయవాడ–కడపలకు విమాన సర్వీసులు నడిపేందుకు టెండర్లు వేసి ఈ రూట్లలో ఉడాన్ పథకంలో భాగంగా విమానాలు నడిపేందుకు సిద్దమయ్యాడు.

ఈ పథకంలో భాగంగా వారానికి ఏడు విమానాల సర్వీసులను కల్పించడంతో పాటు సుమారు 70 సీట్లకు పైగా వున్న తన విమానాలతో సర్వీసులు అందజేస్తున్నారు. ఈ టెండర్లతో తమ విమానాలు ఖాళీగా వున్నా.. మళ్లీ గమ్యస్థానాలు చేరేందుకు ప్రయాణికులు లేకపోయినా ఖచ్చితంగా నిర్ణీత సమయానికి టేకాప్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వుంటుంది. ఈ క్రమంలో తొలినాళ్లలో విమానయాన సంస్థలకు భారీ నష్టాలు ముంచెత్తుకోస్తాయని తెలిసినా.. నా రాష్ట్రం.. నా ప్రజలు అన్న భావన వుండబట్టే.. నష్టాలను కూడా భరించేందుకు సిద్దమైన చరణ్ ఈ అర్సీఎస్ పథకంలో పాల్గోన్నారు.

చంద్రబాబు రాంచరణ్ ట్రూజెట్ కు ఇచ్చింది గిఫ్టా..?

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం రాంచరణ్ ట్రూజెట్ కు కానుక ఇచ్చిందని వస్తున్న వార్తల్లో నిజమెంత.? అంటే పాఠకులకు ఇదివరకు అర్థమైవుండాలి. విజయవాడ–కడప, విజయవాడ–తిరుపతి మధ్య విమాన సర్వీసులు నడిపినందుకు ముందకు వచ్చిన  ట్రూ జెట్‌కు చెందిన టర్బో మెఘా ఎయిర్‌వేస్‌కు వచ్చిన భారీ నష్టాలలో భాగంగా.. వయాబిలిటీ గ్యాప్ పండింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన 20 శాతం షేరులో భాగంగా నిధులు అందించాల్సి వుంది.

విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి కడప నగరాల మధ్య వారానికి నాలుగు రోజులు ప్రయాణీకులు ఉన్నా, లేకపోయినా రానుపోను సర్వీసులు తప్పనిసరిగా నడపాల్సి ఉంటుంది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న ఏటీఆర్‌–72 విమానాలను ఈ మార్గాల్లో ట్రూ జెట్‌ నడుపుతోంది. దీనివల్ల జరిగే నష్టాన్ని భరిస్తున్నందుకు ప్రతి సర్వీసులో 5 సీట్లను ట్రూ జెట్‌ సంస్థ ప్రభుత్వానికి కేటాయించాల్సి ఉంటుంది. ఇలా ఏడాది కాలానికి 672 సర్వీసులు నడిపినందుకు గాను ట్రూ జెట్‌కు రూ.9.76 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సుమారుగా 9.76 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాంచరణ్ ట్రూ జెట్ కు అందించాల్సి వుండగా, అందులోంచి కేవలం అర్థశాతం అంటే రూ.4.90 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేశారు. దీనిని బట్టి 20 శాతం నిధులకే రాష్ట్రప్రభుత్వం రమారమి పది కోట్లు ఇవ్వనుండగా, ఇక కేంద్ర విమానాయానశాఖ తన 80 శాతం వాటా కింద ఎన్ని నిధులు ఇవ్వాల్సి వుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక డిమాండ్‌ లేని చోట విమాన సర్వీసులు నడిపుతున్న రాంచరణ్ ట్రూజెట్ విమానయాన సంస్థ ఏంత మేరకు నష్టాన్ని భరిస్తుందన్న విషయాలు పాఠకులకు అవగతం అవుతాయని భావిస్తున్నాం.

ఇది నిజం. అంతేకాని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ కు చంద్రబాబు ప్రభుత్వం కానుకులిచ్చిందని, అయన విమానయాన సంస్థకు తాయిలాలు అందించిందని పలు మాద్యమాలలో వచ్చిన కథనాలు సత్యదూరం. మన రాష్ట్రం మన ప్రజలు అన్న భావనతో ఇక్కడ కొంత నష్టం వచ్చినా.. మనవారికే కదా సేవలందిస్తున్నాం అని ముందుకు వచ్చిన రాంచరణ్ సద్దుద్దేశ్యంపై పలు మాద్యమాలు బురదజల్లే ప్రయత్నం చేయడం సమంజసమేనా..? అన్నది కూడా పాఠకులకే వదిలేస్తున్నాం.

RELATED LINKS:-

India presents draft Regional Air Connectivity Scheme

National Civil Aviation Policy, 2016 : Salient Features

International Civil Aviation Organization

Regional Connectivity Scheme fineprint for airlines: 10 facts

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles