ఇండిగో భారీ డిస్కౌంట్ ఆఫర్.. IndiGo Announces Rs. 834 All-Inclusive Offer

Indigo announces rs 834 all inclusive offer

indigo, promotional offer, domestic routes, fare statrs Rs. 834, Transport & Logistics, Interglobe Aviation, Interglobe Aviation, Kolkata, festival, Aditya Ghosh, Jet Airways, IndiGo offer, IndiGo discount, IndiGo sale

IndiGo said that the fares under this offer are non-refundable. And in case of cancellation, only statutory taxes will be refunded.

ఇండిగో భారీ డిస్కౌంట్ ఆఫర్..

Posted: 10/13/2016 03:08 PM IST
Indigo announces rs 834 all inclusive offer

చౌకధర విమానయాన సంస్థ ఇండిగో భారీ డిస్కౌంట్ అఫర్ ను ప్రకటించింది. సంస్థ ప్రమోషనల్ వర్క్ లో భాగంగా తమ కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. పన్నులు, సర్వీస్ చార్జీలన్నింటినీ  కలుపుకొని రూ.834 నుంచి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది. ఎంపిక చేసిన డొమెస్టిక్ రూట్లలో ఈ  తగ్గింపు ధరలను వర్తింప చేస్తున్నట్టు  ప్రకటించింది.  

ఇవాళ అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. అక్టోబర్ 17వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇలా బుక్  చేసుకున్న టికెట్ల ద్వారా  ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 13 ప్రయాణించాల్సి ఉంటుందని ఒక  ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మాత్రం ఇండిగో  వెల్లడి చేయలేదు. అలాగే ఆపర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు చార్జీలు నాన్ రిఫండబుల్ అని సంస్థ ప్రకటించింది.

కాగా ఏదేని కారణం చేత బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించబడతాయని స్పష్టం చేసింది. దీంతో పాటుగా  ఈ పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో  ప్రస్తుత నెట్ వర్క్ లో  47 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు ఇండిగో ప్రకటించింది. కాగా  ఇండిగో వెబ్ సైట్ లో చెక్ చేసినపుడు ఢిల్లీ-జైపూర్ టిక్కెట్ ఈ ప్రచార ఆఫర్ కింద రూ.867 ప్రారంభ ధరగా చూపిస్తోంది. ఢిల్లీ ముంబై టిక్కెట్ ధర నవంబర్ మధ్యలో ప్రయాణానికి రూ.2,030గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo  promotional offer  domestic routes  fare statrs Rs. 834  Jet Airways  IndiGo offer  

Other Articles